ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రొనాల్డో కొత్త కారు కొన్నాడు.. ఖరీదెంతో తెలుసా..!

ABN, First Publish Date - 2020-08-03T22:20:55+05:30

ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ఓ కొత్త కారు కొన్నాడు. అయితే అందరిలా అలాంటి ఇలాంటి కారు కొనలేదు. ప్రపంచంలోనే అత్యంత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ఓ కొత్త కారు కొన్నాడు. అయితే అందరిలా అలాంటి ఇలాంటి కారు కొనలేదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బుగాటీ కారును కొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇటీవల జరిగి ఫుట్‌బాల్ టోర్నీలో ఇటాలియన్ జట్టు జువెంటస్ తరుపున రొనాల్డో బరిలోకి దిగాడు. ఫైనల్‌లో తన జట్టు గెలుపులో కేలక పాత్ర పోషించాడు. దీంతో జువెంటస్ జట్టు 36వ సారి సిరీ-ఏ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. ఈ ఆనందంలో ప్రపంచంలోనే ఖరీదైన బుగాటీ లా వాయిచర్ నోయిర్‌ కారును రొనాల్డో తనకుతాను బహూకరించుకున్నాడు. ఈ మోడల్ కార్లు ప్రపంచం మొత్తంలో కేవలం 10 మాత్రమే తయారయ్యాయి. దీని ఖరీదు దాదాపు 8.5 మిలియన్ యూరోలు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.75 కోట్లన్నమాట. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలను రొనాల్డో తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు. ఈ ఫొటోలపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బెస్ట్ ప్లేయర్ వద్ద బెస్ట్ కార్ ఉందంటూ అభినందిస్తున్నారు.

Updated Date - 2020-08-03T22:20:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising