ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెర్త్‌లో భారత్ టెస్టు మ్యాచ్ లేనట్టే: చెప్పేసిన క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్

ABN, First Publish Date - 2020-05-29T22:51:42+05:30

పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ జరిగే అవకాశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రోబర్డ్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ జరిగే అవకాశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రోబర్ట్స్ తేల్చిచెప్పారు. 2015-2023 మధ్య ఎనిమిదేళ్ల హోస్ట్ సైకిల్‌ సమతౌల్యతను కొనసాగించేందుకు ఆస్ట్రేలియన్ సమ్మర్‌లో పెర్త్‌లో భారత్‌తో టెస్టు మ్యాచ్ నిర్వహించడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ ఈ ఏడాది పెర్త్‌లో భారత్‌ టెస్టు మ్యాచ్ ఆడితే అప్పుడు పెర్త్ మైదానం ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఇంగ్లండ్‌‌కు రెండు టెస్టులకు, భారత్‌కు రెండు టెస్టులకు మొత్తం నాలుగు టెస్టులకు ఆతిథ్యం ఇచ్చినట్టు అవుతుందన్నారు. అదే సమయంలో బ్రిస్బేన్ కేవలం రెండు టెస్టులకే ఆతిథ్యం ఇచ్చినట్టు అవుతుందన్నారు. ఈ అసమతౌల్యాన్ని తగ్గించేందుకే పెర్త్‌లో భారత్‌తో టెస్టు మ్యాచ్ నిర్వహించడం లేదని వివరించారు. 


ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ఈ ఏడాది డిసెంబరులో మొదలు కానుంది. డే-నైట్ టెస్టు అయిన రెండోది అడిలైడ్‌లో డిసెంబరు 11న ప్రారంభం కానుంది. తొలి టెస్టు డిసెంబరు 3న ప్రారంభం కానుండగా, మూడు, నాలుగు టెస్టుల వరుసగా డిసెంబరు 26, జనవరి 3న ప్రారంభమవుతాయి. 

  

Updated Date - 2020-05-29T22:51:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising