ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెంచరీకి ఒక్క రన్ ముందు గేల్ ఔట్.. కోపంతో..

ABN, First Publish Date - 2020-10-31T03:33:22+05:30

ఐపీఎల్ టీ20లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్ టీ20లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 63 బంతుల్లో 8 సిక్స్‌లు, 6 ఫోర్లతో 99 పరుగులు చేశాడు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉండగా ఆర్చర్ బౌలింగ్‌లో గేల్ బౌల్డ్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. 100 పరుగులకు ఒక్క పరుగు దూరంలో ఔట్ కావడంతో క్రిస్ గేల్ కోపాన్ని ఆపుకోలేకపోయాడు. అసహనంతో బ్యాట్‌ను నేలకేసి విసిరి కొట్టబోయాడు. ఆ సమయంలో బ్యాట్ జారి కొంచెం దూరంలో పడింది. ఔట్ కావడం పట్ల గేల్ కోపంతో ఊగిపోయినప్పటికీ ఆ తర్వాత బౌలింగ్ చేసి తన వికెట్ తీసిన ఆర్చర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి హుందాగా వెనుదిరిగాడు. 99 పరుగుల వద్ద గేల్ ఔట్ కావడంతో ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశ చెందారు. అయితే.. గేల్ ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్స్‌లతో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 1000 సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా గేల్ రికార్డులకెక్కాడు.

Updated Date - 2020-10-31T03:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising