ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

99 పరుగులు చేసిన క్రిస్‌గేల్‌కు జరిమానా!

ABN, First Publish Date - 2020-10-31T23:17:26+05:30

రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన పంజాబ్ ఆటగాడు, విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ 63 బంతుల్లో 6 ఫోర్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన పంజాబ్ ఆటగాడు, విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 99 పరుగులు చేసి సెంచరీకి ఒక్క పరుగు ముంగిట అవుటయ్యాడు. జోఫ్రా అర్చర్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన గేల్ బౌల్డయ్యాడు. శతకం ఖాయమనుకున్న వేళ అవుట్‌ను ఊహించని గేల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. అవుట్ అతడిని తీవ్ర వేదనకు గురిచేసింది.


దీనిని తట్టుకోలేకపోయిన గేల్ బ్యాట్‌ను బలంగా నేలకేసి బాదాడు. అది కాస్తా జారి అల్లంత దూరాన పడింది. ఆ తర్వాత తనను ఔట్ చేసిన అర్చర్‌ను మెచ్చుకుంటూ గేల్ మైదానాన్ని వీడాడు. అయితే, బ్యాట్‌ను విసిరికొట్టడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఐపీఎల్ అతడిపై చర్యలు తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. 

Updated Date - 2020-10-31T23:17:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising