ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాపిల్ కంపెనీకి చైనా కంపెనీ ఝలక్.. 1.4 బిలియన్లు కట్టాలని డిమాండ్

ABN, First Publish Date - 2020-08-04T01:20:33+05:30

స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్‌కు చైనీస్ ఏఐ కంపెనీ ఝలక్ ఇచ్చింది. తమ టెక్నాలజీని అనుమతి లేకుండా యాపిల్ వినియోగిస్తోందని కోర్టులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్‌కు చైనీస్ ఏఐ కంపెనీ ఝలక్ ఇచ్చింది. తమ టెక్నాలజీని అనుమతి లేకుండా యాపిల్ వినియోగిస్తోందని కోర్టులో కేసు వేసింది. దీనికి గానూ ఏకంగా 1.43 బిలియన్ డాలర్లు(రూ.10,536కోట్లకు పైగా) నష్టపరిహారం చెల్లించాలని షాంఘై జిఝెన్ ఇంటల్లిజెన్స్ నెట్‌వర్స్ టెక్నాలజీ కార్పొరేషన్ డిమాండ్ చేస్తోంది. ‘యాపిల్ కంపెనీ స్మార్ట్‌ఫోన్లలో వినియోగిస్తున్న సిరి వాయిస్ కమాండ్ టెక్నాలజీ మాకు చెందింది. ఆ టెక్నాలజీపై పేటెంట్ కోసం 2004లోనే దరఖాస్తు చేసుకున్నాం. దాంతో 2009లో ఆ టెక్నాలజీపై పూర్తి హక్కులు మా కంపెనీకి లభించాయి. అయితే యాపిల్ మాత్రం తమ స్మార్ట్ ఫోన్లలో మా టెక్నాలజీని యథేచ్ఛగా వినియోగిస్తోంది. వెంటనే ఆ సంస్థ నిబంధనలను అతిక్రమించడం మాని మాకు నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఈ టెక్నాలజీని వాడడానికి వీల్లేద’ని షాంఘై జిఝెన్ కంపెనీ తన దావాలో పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ విషయంపై ఇదివరకే 2012లో కూడా సదరు సంస్థ యాపిల్ కంపెనీపై కోర్టుకెక్కింది. ఆ కేసులో చైనా సుప్రీం కోర్టు కూడా షాంఘై కంపెనీకి అనుకూలంగానే తీర్పు చెప్పింది.

Updated Date - 2020-08-04T01:20:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising