ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నితీశ్ రాణా మెరుపులు.. చెన్నై ఎదుట భారీ విజయ లక్ష్యం

ABN, First Publish Date - 2020-10-30T02:50:48+05:30

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసి సవాలు విసిరింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌‌కతాకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసి సవాలు విసిరింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌‌కతాకు శుభారంభం లభించింది. శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణాలు చెలరేగి ఆడారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 17 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసిన గిల్.. కర్న్ శర్మ బౌలింగులో బౌల్డయ్యాడు.


ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సునీల్ నరైన్ (7), రింకు సింగ్ (11), ఇయాన్ మోర్గాన్ (15)‌లు రాణించకపోయినా క్రీజులో కుదురుకున్న రాణా చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 పరుగులు చేసి లుంగి ఎంగిడి బౌలింగులో శామ్ కరన్‌కు దొరికిపోయాడు. దినేశ్ కార్తీక్ (21), రాహుల్ త్రిపాఠి (2) నాటౌట్‌గా నిలిచారు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి 2 వికెట్లు పడగొట్టగా, శాంట్నర్, రవీంద్ర జడేజా, కర్న్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.

Updated Date - 2020-10-30T02:50:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising