ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్ అప్‌డేట్: చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 163 పరుగులు

ABN, First Publish Date - 2020-09-20T03:08:45+05:30

షేక్ జాయేద్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: షేక్ జాయేద్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. చెన్నై జట్టు ముందు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ తొలి బంతికే ఫోర్ కొట్టినప్పటికీ ఆ దూకుడును కొనసాగించలేకపోయాడు. 10 బంతుల్లో 12 పరుగులు చేసి చావ్లా బౌలింగ్‌లో శామ్ కరన్‌కు క్యాచ్‌గా చిక్కి రోహిత్ పెవిలియన్ బాట పట్టాడు. ముంబై మరో ఓపెనర్ డికాక్ 33 పరుగులతో రాణించాడు. శామ్ కరన్ బౌలింగ్‌లో వాట్సన్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు.


సౌరభ్ తివారి 42 పరుగులు చేసి హాఫ్ సెంచరీ దిశగా దూకుడుగా ఆడుతుండగా.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి డుప్లెసిస్‌కు క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు. హార్థిక్ పాండ్యా(14) వరుసగా రెండు సిక్స్‌లతో మెరిపించినా.. జడేజా బౌలింగ్‌లో ఆడుతుండగా.. డుప్లెసిస్ గాల్లో ఎగిరి మరీ క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు వెళ్లక తప్పలేదు. పొలార్డ్ 18, క్రూనల్ పాండ్యా 3, జేమ్స్ పట్టిన్సన్ 11, రాహుల్ చాహర్ 2, బూమ్రా 5 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో లుంగీ ఎంగిడీకి 3 వికెట్లు, దీపక్ చాహర్ 2, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీయగా.. శామ్ కరన్, పీయూష్ చావ్లాకు చెరో వికెట్ దక్కింది.

Updated Date - 2020-09-20T03:08:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising