ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలి పోరు ఆ ఇద్దరి మధ్యే!

ABN, First Publish Date - 2020-09-07T09:42:34+05:30

ఉత్కంఠ వీడింది. ఐపీఎల్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ఎట్టకేలకు ఆదివారం విడుదల చేసింది. గత టోర్నీ విజేత-రన్నర్‌పలు తొలి మ్యాచ్‌లో ఢీకొనే సంప్రదాయం ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబైతో చెన్నై ఢీ

ఐపీఎల్‌ షెడ్యూల్‌ విడుదల

మొత్తం 10 డబుల్‌ హెడర్లు

దుబాయ్‌ : ఉత్కంఠ వీడింది. ఐపీఎల్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ఎట్టకేలకు ఆదివారం విడుదల చేసింది. గత టోర్నీ విజేత-రన్నర్‌పలు తొలి మ్యాచ్‌లో ఢీకొనే సంప్రదాయం కొనసాగనుంది. ఈనెల 19న (శనివారం) జరిగే ఐపీఎల్‌ ఆరంభం పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ యూఏఈ రాజధాని అబుదాబిలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30కి మ్యాచ్‌ మొదలవుతుంది. ఇక 21న దుబాయ్‌లో (బెంగళూరుతో) జరిగే మ్యాచ్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన పోరును ఆరంభించనుంది. టోర్నమెంట్‌లో మొత్తం 10 డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో తొలి పోరు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30కి, రెండో పోటీ రాత్రి 7.30కి మొదలవుతాయి. లీగ్‌ మ్యాచ్‌ల పూర్తి వివరాలను ప్రకటించిన బీసీసీఐ..ప్లే ఆఫ్స్‌, ఫైనల్‌ పోరుతోపాటు, మహిళల టీ20 లీగ్‌ తేదీలు, అవి ఎక్కడ నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. టైటిల్‌ ఫైట్‌ నవంబరు 10న జరగనున్న సంగతి తెలిసింది. 


60 మ్యాచ్‌లు

సుదీర్ఘంగా 53 రోజులపాటు సాగే ఈ ఐపీఎల్‌లో 56 లీగ్‌ మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్‌లతో కలిపి మొత్తం 60 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక లీగ్‌ చరిత్రలో ఇది సుదీర్ఘ టోర్నీగా రికార్డు సృష్టించనుంది. వాస్తవానికి ఈ షెడ్యూల్‌ను గతవారమే విడుదల చేయాల్సి ఉంది. కానీ అబుదాబి, షార్జా, దుబాయ్‌లలో స్వీయ నిర్బంధ నిబంధనలు వేర్వేరుగా ఉండడం, సీఎ్‌సకే జట్టులో ఇద్దరు క్రికెటర్లు సహా 13 మంది కొవిడ్‌ బారిన పడడంతో ప్రకటన ఆలస్యమైంది. ఇక..అదనంగా ఆరు రోజుల స్వీయ నిర్బంధంతో అన్ని జట్లకంటే చివరగా చెన్నై సాధన ప్రారంభించడంతో..టోర్నీ మొదటి మ్యాచ్‌కు ఆ జట్టు సిద్ధంగా ఉంటుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ షెడ్యూల్‌ విడుదలతో ఆ అనుమానాలు పటాపంచలయ్యాయి. 




Updated Date - 2020-09-07T09:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising