ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాహల్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు

ABN, First Publish Date - 2020-11-27T23:34:07+05:30

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చాహల్ పది ఓవర్లలో ఏకంగా 89 పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా గతంలో 88 పరుగులతో ఉన్న తన రికార్డును తానే అధిగమించాడు. 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహల్ 88 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఇప్పుడా చెత్త రికార్డును తిరగరాశాడు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ ఒక వన్డేలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్‌గా చెత్త రికార్డును తన పేరును లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో 2015లో జరిగిన వన్డేలో ఏకంగా 106 పరుగులు సమర్పించుకున్నాడు.


తాజా మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్‌ను గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపి ఊపుమీదున్నట్టు కనిపించినప్పటికీ ఆ తర్వాత చాహల్ బౌలింగ్ తేలిపోయింది. మ్యాక్స్‌వెల్ అయితే చెలరేగిపోయాడు. 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ (114), స్మిత్ (105) శతకాలతో చెలరేగారు. ఫలితంగా 374 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసి 66 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Updated Date - 2020-11-27T23:34:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising