ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ స్టైల్ ఎలా వచ్చిందో తెలీదు.. బౌలింగ్‌పై బుమ్రా

ABN, First Publish Date - 2020-06-02T04:07:59+05:30

వినూత్న బౌలింగ్ యాక్షన్‌తో టపాటపా వికెట్లు పడగొడుతూ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. తన ప్రత్యేక బౌలింగ్ శైలిపై స్పందించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: వినూత్న బౌలింగ్ యాక్షన్‌తో టపాటపా వికెట్లు పడగొడుతూ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. తన ప్రత్యేక బౌలింగ్ శైలిపై స్పందించాడు. ఐసీసీ పోడ్‌కాస్ట్‌లో షాన్ పొలాక్, ఇయాన్ బిషప్‌లతో చర్చ సందర్భంగా తన శైలి గురించి మాట్లాడాడు. ఆ బౌలింగ్ యాక్షన్ ఎలా వచ్చిందో తనకు కూడా తెలియదని కుండబద్దలు కొట్టాడు. తాను ఇప్పటి వరకూ సొంతగానే క్రికెట్ నేర్చుకున్నానని, వీడియోలూ గట్రా చూసి నేర్చుకున్న ఆటేనని చెప్పాడు. అలాగే రన్-అప్ గురించి కూడా మాట్లాడాడు. తక్కువ రన్-అప్‌తో వేగంగా బంతులు విసరడం కూడా బుమ్రా స్పెషాలిటీనే. దీనిపై మాట్లాడుతూ.. తమ బ్యాక్‌యార్డ్‌ చిన్నదని, దాని వల్ల ఎక్కువ దూరం పరిగెత్తడం కుదరదని చెప్పాడు. అక్కడ ఆడటం వల్లే ఇలా తక్కువ దూరం నుంచే వేగంగా బంతులు విసరడం అలవాటయిందని వెల్లడించాడు. ‘తొలినాళ్లలో నేను కూడా ఎక్కువ దూరం పరిగెత్తడానికి ప్రయత్నించా. కానీ దాని వల్ల బౌలింగ్‌లో వేగం ఏమాత్రం పెరగలేదు. అలాంటప్పుడు ఎందుకు ఎక్కువ దూరం పరిగెత్తడం?’ అని ప్రశ్నించాడు. 

Updated Date - 2020-06-02T04:07:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising