ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మర్రే అవుట్‌

ABN, First Publish Date - 2020-09-28T10:56:25+05:30

మూడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత.. బ్రిటన్‌ స్టార్‌ ఆటగాడు ఆండీ మర్రేకు 16వ సీడ్‌ స్టాన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) షాకిచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హలెప్‌, అజరెంకా శుభారంభం

ఫ్రెంచ్‌ ఓపెన్‌ను వణికిస్తున్న చలి


పారిస్‌: మూడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత.. బ్రిటన్‌ స్టార్‌ ఆటగాడు ఆండీ మర్రేకు 16వ సీడ్‌ స్టాన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) షాకిచ్చాడు. ఆదివారం ప్రారంభమైన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో 33 ఏళ్ల మర్రే 1-6, 3-6, 2-6తో వావ్రింకా చేతిలో పరాజయం పాలయ్యాడు. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెన్‌ మాజీ చాంపియన్‌  పీటర్‌ కోర్డా కుమారుడు సెబాస్టియన్‌ కొర్డా 6-2, 4-6, 6-3తో ఆండ్రెస్‌ సెప్పీ (ఇటలీ)పై పోరాడి గెలిచాడు. మహిళల విభాగంలో సిమోనా హలెప్‌, విక్టోరియా అజరెంకా శుభారంభం చేశారు. 29వ పుట్టిన రోజు జరుపుకుంటున్న హలెప్‌ (రొమేనియా) 6-4, 6-0తో సారా టొర్మో (స్పెయిన్‌)పై తొలి రౌండ్లో నెగ్గి ముందంజ వేసింది. తొలి సెట్‌లో హలెప్‌కు సారా కొంతమేర పోటీ ఇచ్చినా రెండో సెట్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. మరో మ్యాచ్‌లో బెలారస్‌ స్టార్‌ అజరెంకా 6-1, 6-2తో డంకా కొవినిక్‌పై విజయం సాధించి రెండో రౌండ్లో ప్రవేశించింది. అమెరికా వెటరన్‌ క్రీడాకారిణి వీనస్‌ విలియమ్స్‌ 4-6, 4-6తో అన్నా కరోలినా (స్లొవేకియా) చేతిలో పరాజయం పాలై తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఇక, ఈ పోటీల్లో టెన్నిస్‌ స్టార్లను చలి వాతావరణం వణికిస్తోంది. ఉష్ణోగత్ర 8 డిగ్రీలకు పడిపోవడంతో పాటు శీతల గాలులు బలంగా వీస్తుతుండడంతో ప్లేయర్లు చలిని తట్టుకునే దుస్తులను వేసుకొని ఆడాల్సి వచ్చింది. 

Updated Date - 2020-09-28T10:56:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising