ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శెభాష్ బట్లర్: షేన్ వార్న్

ABN, First Publish Date - 2020-08-11T02:52:22+05:30

బట్లర్ వంటి ఆటగాళ్లు ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు ఎంతో అవసరమని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ పేర్కొన్నాడు. బట్లర్ గొప్ప ఆటగాడని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్‌బెర్రా: బట్లర్ వంటి ఆటగాళ్లు ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు ఎంతో అవసరమని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ పేర్కొన్నాడు. బట్లర్ గొప్ప ఆటగాడని, అలాంటి టెస్ట్ బ్యాట్స్‌మన్ జట్టుకు ఎంతో అవసరమని అన్నాడు. పాకీస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలుపు కోసం ఓక్స్‌తో కలిసి బట్లర్ అద్భుతంగా పోరాడిన విషయం తెలిసిందే. వీరిద్దరి పోరాటంతో ఓటమి అంచున ఉన్న ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. దీనిపై వార్న్ స్పందిస్తూ, బట్లర్ అద్భుతంగా ఆడాడని, అతడి అండతో ఓక్స్ కూడా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడని అభిప్రాయపడ్డాడు. ‘బట్లర్‌కు తన ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే క్రీజులో పాతుకుపోయాడు. ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కొన్నాడు. తాను మాత్రమే జట్టును ముందుకు నడింపిచగలనని భావించాడు. అదే అతడిని విజేతగా నిలిపింద’ని వార్నర్ పేర్కొన్నాడు.

Updated Date - 2020-08-11T02:52:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising