ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టోక్స్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉండాలి: స్టీవ్ స్మిత్

ABN, First Publish Date - 2020-08-01T21:51:43+05:30

బెన్ స్టోక్స్.. ఇటీవల కాలంలో ఈ ఇంగ్లాండ్ పేరు మారుమోగిపోతుంది. ప్రపంచ దేశాల మాజీ, ప్రస్తుత క్రికెటర్లందరూ స్టోక్స్‌ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్‌బెర్రా: బెన్ స్టోక్స్.. ఇటీవల కాలంలో ఈ ఇంగ్లాండ్ పేరు మారుమోగిపోతుంది. ప్రపంచ దేశాల మాజీ, ప్రస్తుత క్రికెటర్లందరూ స్టోక్స్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అద్భుతమైన ఆటగాడని, నెంబర్ వన్ ఆల్‌రౌండర్ అని తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ కూడా చేరాడు. స్టోక్స్ వంటి ఆటగాళ్లు ఉంటే జట్టు పటిష్ఠంగా ఉంటుందని, అతడు తన జట్టులో ఉండటం ఎంతో ఆనందంగా ఉందని ప్రశంసల జల్లు కురిపించాడు. సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ -2020 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం అభిమానులతో పాటు ఆటగాళ్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండడంతో పలువురు క్రికెటర్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్మిత్ తన జట్టు రాజస్థాన్ రాయల్స్‌ ఆటగాడు స్టోక్స్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘బెన్ స్టోక్స్ గొప్ప ఆల్‌రౌండర్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడు విభాగాల్లోనూ అతడు రాణించగలడు. జట్టు ఎంత క్లిష్ట పరిస్థితులలో ఉన్నా స్టోక్స్ వంటి ఆటగాళ్లు పోరాడి గెలిపించగలరు. ప్రపంచ కప్‌-2019లో అద్భుతంగా ఆడి ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల విండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ గొప్ప ప్రదర్శన చేశాడు. స్టోక్స్ తన ప్రతిభను అంతకంతకూ పెంచుకుంటున్నాడు. అందుకే అలాంటి ఆల్‌రౌండర్లు జట్టులో ఉండటం చాలా ముఖ్యమ’ని స్మిత్ పేర్కొన్నాడు.

Updated Date - 2020-08-01T21:51:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising