ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత బ్యాటింగ్‌లో మెరుపులు కరువు.. ఆసీస్ ఎదుట ఓ మాదిరి విజయ లక్ష్యం

ABN, First Publish Date - 2020-12-04T21:13:28+05:30

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ మనుకా ఓవల్‌లో జరిగిన తొలి టీ20లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్‌బెర్రా: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ మనుకా ఓవల్‌లో జరిగిన తొలి టీ20లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన భారత ఇన్నింగ్స్‌లో మెరుపులు మిస్సయ్యాయి. చెలరేగిపోతారనుకున్న ఆటగాళ్లందరూ చతికిలపడ్డారు. ఫలితంగా టీమిండియా ఓ మాదిరి స్కోరుకు పరిమితమైంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు మాత్రం ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలవడంతో భారత జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.  40 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 5 ఫోర్లు, సిక్సర్‌తో 51 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 44 పరుగులు చేశాడు. సంజు శాంసన్ (23),  శిఖర్ ధవన్ (1), కెప్టెన్ కోహ్లీ (9), మనీష్ పాండే (2), హార్దిక్ పాండ్యా (16) ఘోరంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో  మోయిసెస్ హెన్రిక్స్ 3 వికెట్లు తీసుకోగా, మిచెల్ స్టార్క్ 2, ఆడం జంపా, మిచెల్ స్వెపన్ చెరో వికెట్ పడగొట్టారు. 

Updated Date - 2020-12-04T21:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising