ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాక్షి మాలిక్‌కు రజతం

ABN, First Publish Date - 2020-02-22T10:32:24+05:30

ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత మహిళల పతక పట్టు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పోటీల్లో ఓ రజతం, మూడు కాంస్యాలు భారత్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వినేశ్‌, అన్షులకు కాంస్యాలు

 ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత మహిళల పతక పట్టు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పోటీల్లో ఓ రజతం, మూడు కాంస్యాలు భారత్‌ ఖాతాలో చేరాయి. ఒలింపిక్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌ (65 కిలోలు) రజత పతకంతో మెరవగా.. మరో స్టార్‌ వినేశ్‌ ఫొగట్‌ (53 కిలోలు), యువ రెజ్లర్లు అన్షు మాలిక్‌ (57 కిలోలు), గురుశరణ్‌ప్రీత్‌ కౌర్‌ (72 కిలోలు) కంచు మోత మోగించారు. ఫైనల్లో సాక్షి 0-2తో నవోమి రుకీ (జపాన్‌) చేతిలో ఓడి రజతానికే పరిమితమైంది. కాంస్యం కోసం జరిగిన ప్లేఆఫ్స్‌ బౌట్లలో తి లి కియు (వియత్నాం)పై వినేశ్‌ ఫొగట్‌, సెవారా (ఉజ్భెకిస్థాన్‌)పై అన్షు, ఎక్‌బయార్‌ (మంగోలియా)పై గురుశరణ్‌ప్రీత్‌ కౌర్‌ గెలిచారు. దీంతో ఈ టోర్నీలో భారత మహిళలు ఓవరాల్‌గా ఎనిమిది పతకాల (మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, మూడు కాంస్యాలు)తో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారు.   

Updated Date - 2020-02-22T10:32:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising