ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్జునకు అంకిత, శరణ్‌

ABN, First Publish Date - 2020-05-18T09:15:35+05:30

ఆసియా క్రీడల పతక విజేతలు అంకితా రైనా, దివిజ్‌ శరణ్‌ను ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ఆలిండియా టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) నామినేట్‌ చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఏఐటీఏ ప్రతిపాదన

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల పతక విజేతలు అంకితా రైనా, దివిజ్‌ శరణ్‌ను ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ఆలిండియా టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) నామినేట్‌ చేసింది. డేవిస్‌ కప్‌ మాజీ కోచ్‌ నందన్‌బాల్‌ (60) పేరును ‘ధ్యాన్‌చంద్‌’ పురస్కారానికి ప్రతిపాదించారు. 27 ఏళ్ల అంకిత 2018 ఆసియా క్రీడల్లో మహిళల సింగి ల్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఫెడ్‌క్‌పలోనూ ఆమె అద్భుతంగా రాణించింది. వరల్డ్‌కప్‌ ప్లేఆఫ్స్‌కు భారత్‌ తొలిసారి క్వాలిఫై కావడంలోనూ కీలకపాత్ర పోషించింది. ఢిల్లీకి చెందిన దివిజ్‌ శరణ్‌ వెటరన్‌ ఆటగాడు రోహన్‌ బోపన్నతో కలిసి 2018 ఆసియా క్రీడల్లో డబుల్స్‌లో స్వర్ణం గెలిచాడు. 2019లో అతను రెండు ఏటీపీ టైటిళ్లు నెగ్గాడు. కాగా, భారత డేవిస్‌ కప్‌ మాజీ ఆటగాడైన నందన్‌బాల్‌.. రిటైర్మెంట్‌ తర్వాత చాన్నాళ్లు డేవిస్‌ కప్‌ కోచ్‌గా పని చేశాడు. 

Updated Date - 2020-05-18T09:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising