దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. ఆర్చర్, స్టోక్స్‌కు ఇంగ్లండ్ విశ్రాంతి
ABN, First Publish Date - 2020-11-04T01:10:03+05:30
దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ బోర్డు 15 మంది ఆటగాళ్లు, ముగ్గురు రిజర్వు ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది.
లండన్: దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఇంగ్లండ్ బోర్డు 15 మంది ఆటగాళ్లు, ముగ్గురు రిజర్వు ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌పై కన్నేసిన ఇంగ్లండ్.. జోఫ్రా ఆర్చర్, బెన్‌స్టోక్స్, శామ్ కరన్‌లకు విశ్రాంతి ఇచ్చింది. మొత్తం 23 మంది ఆటగాళ్ల పేర్లను ప్రకటించగా, వారిలో పదిమంది వన్డే, టీ20 జట్టులోనూ ఉన్నారు. ఆర్చర్, స్టోక్స్, శామ్ కరన్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ మలాన్‌లను మాత్రం టీ20లకు ఎంపిక చేసింది. జో రూట్, క్రిస్ వోక్స్, ఓలీ స్టోన్, లూయిస్ గ్రెగరీ, లియామ్ లివింగ్‌స్టోన్‌లకు వన్డే జట్టులో చోటిచ్చింది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న జోస్ బట్లర్‌పై వర్క్‌లోడ్ ఉన్నప్పటికీ వన్డే, టీ20లు రెండింటికీ ఎంపిక చేసింది.
Updated Date - 2020-11-04T01:10:03+05:30 IST