ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవాస్కర్‌.. మీకిది తగునా?

ABN, First Publish Date - 2020-09-26T09:13:10+05:30

పంజాబ్‌, బెంగళూరు మ్యాచ్‌ సందర్భంగా కామెంటేటర్‌ సునీల్‌ గవాస్కర్‌ తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భర్త ఆట గురించి భార్యపై ఆరోపణలా!

సన్నీపై అనుష్క ఆగ్రహం

న్యూఢిల్లీ: పంజాబ్‌, బెంగళూరు మ్యాచ్‌ సందర్భంగా కామెంటేటర్‌ సునీల్‌ గవాస్కర్‌ తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో సన్నీ మాట్లాడుతూ.. ‘ఇటీవల నేను చూసిన ఓ వీడియోలో లాక్‌డౌన్‌ సందర్భంగా భార్య అనుష్క బౌలింగ్‌లో కోహ్లీ ప్రాక్టీస్‌ చేయడం కనిపించింది. ఆ ప్రాక్టీస్‌ ఇక్కడ సరిపోదు. కఠోర సాధనతోనే తన బ్యాటింగ్‌ మెరుగుపడుతుందని విరాట్‌కు తెలుసు. అంతే తప్ప అనుష్క బౌలింగ్‌లో చేసిన ప్రాక్టీస్‌ వల్ల కాదు’ అని కామెంట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ ఒక్క పరుగుకే వెనుదిరిగిన విషయం తెలిసిందే. గవాస్కర్‌ కామెంట్స్‌పై కోహ్లీ ఫ్యాన్స్‌తో పాటు విరాట్‌ భార్య అనుష్క శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎన్నాళ్లు క్రికెట్‌లోకి తన పేరును లాగుతారని ఆమె ప్రశ్నించింది. ‘మిస్టర్‌ గవాస్కర్‌. మీరు చేసిన కామెంట్‌ అగౌరవపరిచే విధంగా ఉంది. భర్త ఆట గురించి భార్యపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో వివరించండి. మీ కామెంట్రీలో ఏరోజూ ఇతరుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదనే విషయం తెలుసు. మరి మా విషయంలో ఎందుకు పొరబడ్డారు? ఇది 2020.. అయినా పరిస్థితులు ఏమీ మారలేదు. క్రికెట్‌లోకి నన్ను లాగడం ఎప్పుడు మానుకుంటారు? మీరో లెజెండ్‌. మీ మాటలు విని నేనెంత బాధపడ్డానో తెలిపేందుకే ఇలా స్పందిస్తున్నా’ అని అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. కాగా.. తన వ్యాఖ్యలపై గవాస్కర్‌ వివరణ ఇచ్చాడు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నాడు. కేవలం శీర్షికలను చూసి ఓ అభిప్రాయానికి రావొద్దని, తానేమన్నానో మరొక్కసారి వినాలని కోరాడు.

Updated Date - 2020-09-26T09:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising