ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్ ఈ ఏడాదే జరిగే అవకాశం ఉంది: కుంబ్లే

ABN, First Publish Date - 2020-05-29T03:28:01+05:30

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ పైనే ఐపీఎల్-13 భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబరు లేదంటే నవంబరులో ఐపీఎల్ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. పలువురు తాజా, మాజీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఈ ఏడాదే జరిగే అవకాశం ఉందంటున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు హెడ్‌కోచ్ అనిల్ కుంబ్లే తాజాగా మాట్లాడుతూ ఐపీఎల్ ఈ ఏడాదే జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే, ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ జరిగే అవకాశం ఉందన్నాడు. 


మరోవైపు, అక్టోబరులో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ‘‘అవును ఐపీఎల్‌పై ఇంకా ఆశలు సజీవంగా ఉన్నాయి’’ అని ఓ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ కుంబ్లే ఆశాభావం వ్యక్తం చేశాడు. అభిమానులు లేకుండా ఆడితే మూడు, నాలుగు వేదికలు సరిపోతాయని అన్నాడు. ఈ విషయంలో తాను ఆశాభావంతో ఉన్నట్టు చెప్పాడు. మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆటగాళ్ల ప్రయాణాన్ని తగ్గించేందుకు బహుళ స్టేడియాలు ఉన్న నగరాల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు మ్యాచ్‌లు నిర్వహించవచ్చని అన్నాడు. ఈ ఏడాదే ఐపీఎల్ జరిగే అవకాశం ఉందని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

Updated Date - 2020-05-29T03:28:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising