ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్‌ ఇక కష్టమే?

ABN, First Publish Date - 2020-03-25T10:59:54+05:30

కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. వచ్చే నెల 15వరకు ఐపీఎల్‌ను వాయిదా వేసినా.. ప్రస్తుత పరిస్థితుల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్రాంచైజీలతో బీసీసీఐ కాన్ఫరెన్స్‌ వాయిదా 

న్యూఢిల్లీ: కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. వచ్చే నెల 15వరకు ఐపీఎల్‌ను వాయిదా వేసినా.. ప్రస్తుత పరిస్థితుల్లో లీగ్‌ నిర్వహణ కష్టమనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. వైరస్‌ తీవ్రత ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై ఫ్రాంచైజీ యజమానులతో మంగళవారం షెడ్యూల్‌ చేసిన కాన్ఫరెన్స్‌ కాల్‌ను బీసీసీఐ వాయిదా వేసింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌ రద్దవుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.


‘మానవత్వమే ప్రధానం, దాని తర్వాతే అన్నీ. పరిస్థితులు మెరుగుపడలేదు. ఈ తరుణంలో లీగ్‌ గురించి మాట్లాడడంలో అర్థం లేదు’ అని కింగ్స్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియా అన్నాడు. ఒలింపిక్స్‌ లాంటి మెగా ఈవెంట్‌ వాయిదాపడగా లేనిది ఐపీఎల్‌ ఓ లెక్కా అని బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక.. లీగ్‌లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లకు వీసా ఇచ్చే పరిస్థితులు కూడా లేవన్నారు.

Updated Date - 2020-03-25T10:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising