రెండుమూడు రోజులు కరోనా వల్ల బాగా ఇబ్బందిపడ్డా: అఫ్రీదీ
ABN, First Publish Date - 2020-06-19T01:10:43+05:30
పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో...
పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించాడు. కరోనా బారిన పడ్డ అఫ్రీదీ ఆరోగ్యం మరింత క్షీణించిదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తలను అఫ్రీదీ ఖండించాడు. ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉందని, మొదటి రెండుమూడు రోజులు నిజంగా చాలా కష్టంగా గడచిందని అఫ్రీదీ ఫేస్‌బుక్‌లో వీడియో ద్వారా వెల్లడించాడు.
కంగారు పడాల్సిందేమీ లేదని.. అయితే రోజులు చాలా కష్టంగా గడుస్తున్నాయని అఫ్రీదీ చెప్పాడు. దాదాపు ఎనిమిదితొమ్మిది రోజుల నుంచి తన పిల్లలకు చూసుకోలేకపోతున్నానని, వాళ్ల ప్రేమకు దూరమయ్యానని.. తన బిడ్డలను ప్రేమగా హత్తుకోవాలని ఉందని వీడియోలో అఫ్రీదీ భావోద్వేగానికి లోనయ్యాడు. తాను కోలుకోవాలని ఆకాంక్షించిన వారికి అఫ్రీదీ ధన్యవాదాలు తెలిపాడు.
Updated Date - 2020-06-19T01:10:43+05:30 IST