ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచకప్ గెలిచాకే పెళ్లి చేసుకుంటా: రషీద్ ఖాన్

ABN, First Publish Date - 2020-07-13T02:43:14+05:30

ఆఫ్ఘానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓ భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: ఆఫ్ఘానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓ భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ అదేంటంటారా.. తన దేశం క్రికెట్ ప్రపంచకప్ గెలిచేవరకూ పెళ్లి చేసుకోడంట. తనకు ఇప్పుడు 21 సంవత్సరాలని, దేశానికి ప్రపంచకప్ అందించేందుకు ఎంతో కృషి చేస్తున్నానని చెప్పాడు. కచ్చితంగా త్వరలో తన కల నెరవేరుతుందని, అప్పటివరకూ కనీసం నిశ్చితార్థం కూడా చేసుకోనని కుండ బద్దలు కొడుతున్నాడు. అయితే రషీద్ ఖాన్ ఇప్పటికే ప్రపంచ టీ20 బౌలర్లలో 736 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. 


ఇదిలా ఉంటే ఎప్పుడో 1995లో ప్రపంచ క్రికెట్‌లోకి ఆఫ్ఘనిస్తాన్ అడుగుపెట్టింది. అయితే ఆ తర్వాత కొన్నేళ్లు కనుమరుగైంది. అనంతరం 2001లో ఐసీసీ సభ్యదేశంగా గుర్తింపు పొందింది. అదే ఊపులో నాలుగైదేళ్ల కాలంలో జాతీయ జట్టును సిద్ధం చేసుకుంది. అనంతరం ప్రపంచకప్‌కు అర్హత సాధించడం ద్వారా 2008, 2013 ప్రపంచకప్‌లలో పాల్గొంది. అయితే మొత్తం 15 మ్యాచ్‌లు ఆడిన ఆఫ్ఘాన్ జట్టు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచి మిగిలిన అన్ని మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. ఇదంతా ఓ ఎత్తయితే టీ 20 ప్రపంచకప్‌లలోనూ ఆఫ్ఘాన్ జట్టు చిచ్చర పిడుగు అనిపించుకుంటోంది. పెద్ద పెద్ద జట్లకు సైతం షాక్‌లిస్తూ ముందుకెళుతోంది.

Updated Date - 2020-07-13T02:43:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising