ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చావుబతుకుల్లో ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్

ABN, First Publish Date - 2020-10-04T23:46:27+05:30

ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ నజీబుల్లా తరకై (29) చావుబతుకుల్లో ఉన్నాడు. తూర్పు నంగర్హార్‌లో ఓ గ్రోసరీ మార్కెట్ నుంచి వచ్చి రోడ్డు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ నజీబుల్లా తరకై (29) చావుబతుకుల్లో ఉన్నాడు. తూర్పు నంగర్హార్‌లో ఓ గ్రోసరీ మార్కెట్ నుంచి వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నజీబుల్లాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న నజీబుల్లా పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడే ఏ విషయమూ చెప్పలేమని పేర్కొన్నారు. 


ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు తాత్కాలిక సీఈవో నజీమ్ జార్ అబ్దుల్ రహీంజాయ్ మాట్లాడుతూ.. నజీబుల్లా ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్టు తెలిపారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నజీబుల్లా 12 టీ20లు, ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. టీ20లలో అర్ధ సెంచరీ సహా 258 పరుగులు చేశాడు. అలాగే, 24 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 2030 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 17 లిస్ట్ ఎ మ్యాచుల్లో 553 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.  

Updated Date - 2020-10-04T23:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising