25 కిలోలు ఎక్కువున్నావ్..!
ABN, First Publish Date - 2020-12-29T06:30:12+05:30
మూడోరోజు ఆటలో భారత కీపర్ పంత్, ఆసీస్ బ్యాట్స్‌మన్ వేడ్ మధ్య మాటల యుద్ధం నడిచింది.
మూడోరోజు ఆటలో భారత కీపర్ పంత్, ఆసీస్ బ్యాట్స్‌మన్ వేడ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆసీస్ ఇన్నింగ్స్ సాగుతున్నప్పుడు వికెట్ల వెనకాల కీపర్ రిషభ్ పంత్ అదే పనిగా నవ్వుతూ.. కామెంట్ చేస్తూ కనిపించాడు. 16వ ఓవర్‌లో వేడ్ కల్పించుకుంటూ.. ‘నీవు 25 కిలోలు ఎక్కువ బరువున్నావు కదూ?’ అంటూ ఎగతాళి చేశాడు. అయినా పంత్ నవ్వుతూ ఉండడంతో వేడ్‌కు మండింది.
25వ ఓవర్‌లో అతడు బంతిని డిఫెన్స్ ఆడగా పంత్ వెనకనుంచి ‘హె.. హె.. హే’ అంటూ నవ్వడం మైక్రోఫోన్‌లో రికార్డయింది. చిర్రెత్తుకొచ్చిన వేడ్.. ‘ఎందుకలా నవ్వడం. మరోసారి నిన్ను నీవు బిగ్‌స్ర్కీన్‌పై చూసుకుంటున్నావా? అలా చూసుకోవడం ఫన్నీగా ఉంది కదూ’ అంటూ నోటికి పనిచెప్పాడు. అయినా పట్టించుకోకుండా పంత్ తన స్లెడ్జింగ్‌ను కొనసాగించాడు.
Updated Date - 2020-12-29T06:30:12+05:30 IST