ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా ఫేవరెట్ మ్యాచ్ అదే: కోహ్లీ

ABN, First Publish Date - 2020-05-10T04:07:59+05:30

2016 టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తనకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: 2016 టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తనకు గుర్తుండిపోయే మ్యాచ్ అని భారత కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. ఇటీవల ఓ ఇన్‌స్టాగ్రాం లైవ్ సెషన్‌లో మాట్లాడిన కోహ్లీ ఫ్యాన్స్‌తో పలు విషయాలను పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఫ్యాన్ ‘2011 వరల్డ్ కప్ మ్యాచ్ తర్వాత మీకు నచ్చిన మ్యాచ్ ఏది..?’ అని అడగ్గా.. దానికి కోహ్లీ సమాధానంగా ‘అది కొంచెం కష్టమైన ప్రశ్నే. అయితే పరిస్థితులను బట్టి చూస్తే 2016 టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ టోర్నీకే అది చాలా ముఖ్యమైన మ్యాచ్. అందుకే దానిని ఎంచుకున్నా’ అని చెప్పాడు. 


ఇదిలా ఉంటే ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ ఆడడంపై కూడా కోహ్లీ మాట్లాడాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అలా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని, అయితే వేలమంది అభిమానుల మధ్య, వారి కేరింతల మధ్య ఆడటం అలవాటైన ఆటగాళ్లకు ఖాళీ స్టేడియాలలో ఆడడం కొంచెం కష్టంగానే ఉండవచ్చని, అయితే బరిలోకి దిగిన జట్లు మునుపటిలాగే పోరాడతాయని కోహ్లీ చెప్పుకొచ్చాడు.


Updated Date - 2020-05-10T04:07:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising