ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూమ్ నుంచి సరికొత్త ‘జూమ్ ఫర్ హోం’.. వీడియో కాలింగ్‌తో పాటు ఎన్నో ఫీచర్లు

ABN, First Publish Date - 2020-07-17T00:35:08+05:30

వీడియో కమ్యూనికేషన్ సంస్థ జూమ్ ఓ సరికొత్త ప్రాడక్ట్‌ను వినియోగదారులకోసం తీసుకొచ్చింది. కేవలం వీడియో కాలింగ్‌కోసం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వీడియో కమ్యూనికేషన్ సంస్థ జూమ్ ఓ సరికొత్త ప్రాడక్ట్‌ను వినియోగదారులకోసం తీసుకొచ్చింది. కేవలం వీడియో కాలింగ్‌కోసం మాత్రమే కాకుండా ఆఫీసులో అవసరమైన అన్ని పనులను అత్యంత శులభంగా చేసుకునేందుకు గానూ జూమ్ ఫర్ హోం పేరుతో సాఫ్ట్‌వేర్, హార్డ్ వేర్ ఉపకరణాలను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వీటన్నింటి సాయంతో ప్రతి ఒక్కరూ సులభంగా ఇంటి నుంచే ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించే వీలుంటుందని జూమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా డీటెన్ మీ పేరుతో ఓ మానిటర్‌ను తీసుకొచ్చింది. 27 అంగుళాలన ఈ మానిటర్ ద్వారా ఒకే క్లిక్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడం, గ్రాఫ్‌లు డిజైన్ చేసుకోవడం, పేపర్ వర్క్ లాంటి పనులన్నీ ఇందులోని టచ్‌స్క్రీన్‌తో సునాయాసంగా చేసుకోవచ్చని సంస్థ యాజమాన్యం చెబుతోంది.


ఎడిషనల్ మానిటర్, స్పీకర్లు, కీబోర్డ్, మౌజ్, ఇతరత్రా వైర్లు వంటివాటితో అవసరం లేకుండా టచ్‌ ద్వారా ప్రతి పనినీ చిటికెలో పూర్తి చేసుకోవచ్చని జూమ్ చెబుతోంది. అంతేకాకుండా అతి త్వరలో ఆఫీసులకు అవసరమైన ప్రతి సౌకర్యాన్నీ ఇంటినుంచే పోందేలా మరిన్ని హార్డ్‌వేర్ పరికరాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2020-07-17T00:35:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising