ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్ల్‌ఫ్రెండ్ కోసం వీడియో‌‌కాల్‌లో అలా నిలబడ్డాడు.. సీన్ కట్ చేస్తే..!

ABN, First Publish Date - 2020-07-16T03:43:27+05:30

ఆన్‌లైన్‌లో ఎన్ని రకాలుగా మోసాలు జరుగుతున్నా కొందరి వ్యవహార శైలి అస్సలు మారడం లేదు. వాట్సాప్‌లో పరిచయమైన ఓ మాయలేడి కోసం వీడియో కాల్‌లో దుస్తులు విప్పిన 26 ఏళ్ల ఓ యువకుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఆన్‌లైన్‌లో ఎన్ని రకాలుగా మోసాలు జరుగుతున్నా కొందరి వ్యవహార శైలి ఏమాత్రం మారడం లేదు. ఓ మాయలేడి కోసం వీడియో కాల్‌లో దుస్తులు విప్పిన 26 ఏళ్ల యువకుడు.. ఆ వీడియో నేరగాళ్ల ముఠాకి చిక్కడంతో రూ.22 వేలు సమర్పించుకున్నాడు. డబ్బులు చెల్లించినా వీడియో లీక్ చేస్తామంటూ ఆ ముఠా బెదిరించడంతో... లబోదిమంటూ పోలీసులను ఆశ్రయించాడు.


పోలీసుల కథనం ప్రకారం... బెంగళూరుకు చెందిన సదరు యువకుడికి నెల రోజుల క్రితం వాట్సాప్ ద్వారా ఓ యువతితో పరిచయం ఏర్పడింది. తాను కేరళ నుంచి వచ్చాననీ.. ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్నానంటూ ఆమె బాధితుడిని నమ్మించింది. ప్రస్తుతం తాను రూమ్‌లో ఒక్కడినే ఉంటున్నాననీ.. ఆ అమ్మాయి కోరిక మేరకు ఇటీవల వీడియోకాల్స్‌లో మాట్లాడానని అతడు పోలీసులకు వెల్లడించాడు. ‘‘వారం రోజుల క్రితం చాటింగ్ సందర్భంగా ఆమె నన్ను నగ్నంగా చూస్తానంటూ అడిగింది. తొలుత నేను తిరస్కరించినప్పటికీ.. తాను కూడా అలా చేస్తానంటూ చెప్పడంతో దుస్తులు తీసేశాను. అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే ఆమె ఫోన్ కట్ చేసింది. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ అని వస్తోంది...’’ అని బాధితుడు పోలీసులకు వెల్లడించాడు.


ఆదివారం గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఫోన్ చేసి.. తమ వద్ద న్యూడ్ వీడియో ఉందంటూ వేధించడం మొదలు పెట్టారని అతడు వాపోయాడు. రూ. 50 వేలు చెల్లిస్తే వీడియో డిలీట్ చేస్తామనీ.. కాదంటే ఇంటర్నెట్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తామంటూ నిందితులు బెదిరించారు. బాధితుడు అంత చెల్లించలేనని బతిమాలడంతో రూ.22 వేలకు అంగీకరించారు. అయితే డబ్బు చెల్లించిన మరుసటి రోజే మరింత డబ్బు కావాలంటూ బాధితుడికి ఫోన్ వచ్చింది. దీంతో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని గుర్తించిన బాధితుడు చివరికి పోలీసులను ఆశ్రయించాడు. 

Updated Date - 2020-07-16T03:43:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising