ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లికి వెళుతూ పామును పట్టిన మహిళ... వీడియో వైరల్!

ABN, First Publish Date - 2020-09-19T12:20:58+05:30

ఒక మహిళ అందంగా అలంకరించిుకుని పెళ్లికి బయలుదేరింది. ఇంతలో ఒక ఇంటిలో పాము దూరిన విషయం ఆమెకు తెలిసింది. పాములను పట్టే ఆ మహిళ ఎంతో చాకచక్యంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఒక మహిళ అందంగా అలంకరించిుకుని పెళ్లికి బయలుదేరింది. ఇంతలో ఒక ఇంటిలో పాము దూరిన విషయం ఆమెకు తెలిసింది. పాములను పట్టే ఆ మహిళ ఎంతో చాకచక్యంగా ఆ పామును పట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. డాక్టర్ అజయతా అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.



ఈ ట్వీట్ ప్రకారం పామును పట్టిన ఆ మహిళ పేరు విరాట్ భాగిని అని, ఆమె కర్నాటకకు చెందినవారని తెలుస్తోంది. ఆమె పాములు పడుతుంటారని సమాచారం. ఆమె వివాహానికి హాజరయ్యేందుకు వెళుతుండగా, ఎవరో తమ ఇంటిలోకి పాము దూరిందని ఆమెకు ఫోన్ చేశారు. దీంతో ఆమె అక్కడకు వెళ్లి పామును పట్టారు. ఈ వీడియోను ఇప్పటివరకూ నాలుగు లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఆమె ధైర్యాన్ని కొనియాడుతూ రకరకాలుగా అభినందనలు కురిపిస్తున్నారు. 

Updated Date - 2020-09-19T12:20:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising