ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి కోసం అమ్మ కష్టాలు.. చూడలేని అమ్మాయి చేసిన పనిదీ!

ABN, First Publish Date - 2020-06-30T02:56:08+05:30

అమ్మానాన్నలు పిల్లల కోసం చాలా కష్టాలు పడతారు. పిల్లల సుఖం కోసం తమ సంతోషాలు త్యాగం చేస్తారు. అలాంటి వారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: అమ్మానాన్నలు పిల్లల కోసం చాలా కష్టాలు పడతారు. పిల్లల సుఖం కోసం తమ సంతోషాలు త్యాగం చేస్తారు. అలాంటి వారు వృద్ధులైన తర్వాత ఆ పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను గుర్తిస్తారో లేదో కూడా తెలియదు. అలాంటిది ఓ యువతి అనారోగ్యంతో ఉన్న తల్లి నీటి కోసం పడుతున్న కష్టాలు చూసి తల్లడిల్లిపోయింది. ఓ నిర్ణయానికి వచ్చి అమ్మ కోసం ఏకంగా ఇంట్లో వట్టి చేతులతోనే బావి తవ్వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగాల్‌కు చెందిన బొబితా సోరెన్(24) అనే యువతి తల్లికి 50ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. నీటి కోసం 200మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. అక్కడి నుంచి నీళ్లు మోసుకొని తీసుకురావడం ఆమెకు చాలా కష్టంగా ఉంటుంది. ఈ విషయం గమనించిన బొబితా ఓ నిర్ణయం తీసుకుంది. భగీరధ ప్రయత్నం చేసి కష్టపడి ఇంట్లోనే ఓ బావి తవ్వేసింది. స్వహస్తాలతో 15 అడుగుల లోతు బావి తవ్వింది. ‘మా నాన్న, సోదరుడు చాలా గట్టిగా తాళ్లు కట్టారు. వాటి సాయంతో నేను బావి అడుగు భాగానికి వెళ్లి చక్కగా పనిచేసుకోగలిగా’ అని బొబితా చెప్తోంది. ఎమ్‌ఏ పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం బీఈడీ చదువుతోంది.

Updated Date - 2020-06-30T02:56:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising