ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిమ్లా, మనాలీలో అబ్బురపరుస్తున్న హిమపాత దృశ్యాలు

ABN, First Publish Date - 2020-11-17T12:42:58+05:30

హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు పర్యాటక ప్రాంతాలు మంచు దుప్పట్లను పరుచుకున్నాయి. ఈ ప్రాంతాలలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు పర్యాటక ప్రాంతాలు మంచు దుప్పట్లను పరుచుకున్నాయి. ఈ ప్రాంతాలలో భారీగా మంచు కురుస్తోంది. శిమ్లా, మనాలీలో చలికాలం తొలి రోజులలోనే భారీగా మంచుకురవడం ప్రారంభమయ్యింది. మంచుతో మరింత అందంగా మారిన ప్రకృతి దృశ్యాలను తిలకించేందుకు పర్యాటకులు హిమాచల్ కు తరలివస్తున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలను లెక్కచేయక వస్తున్న పర్యాటకులు ఇక్కడి వాతావారణాన్ని చూసి మైమరచిపోతున్నారు. 



సోమవారం రోజంతా మంచు కురుస్తూనే ఉంది. ఈరోజు కూడా విపరీతంగా మంచు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం ప్రకటించింది. శిమ్లా జిల్లాలోని కుఫ్రీ, నర్కండా, ఖడాపత్తర్ తదితర ప్రాంతాలలో అధికంగా మంచుకురుస్తున్న కారణంగా ఐదవ నంబరు జాతీయ రహదారి మూసుకుపోయింది. దీంతో వాహనదారులు పలు ఇక్కట్లు పడుతున్నారు. 


పర్యాటక ప్రాంతం మనాలీ, సోలంగ్‌నాలాలో హిమపాతం కురుస్తోంది. ఫలితంగా ఇక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మనాలీలోని నటి కంగనా ఇల్లు మంచుతో మూసుకుపోయింది. అటల్ టన్నల్, రోహతాంగ్ తదితర ప్రాంతాలలో ఒక అడుగుమేర మంచు పేరుకుపోయింది.

Updated Date - 2020-11-17T12:42:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising