ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖ‌న‌నం చేసిన వ్య‌క్తి క్షేమంగా తిరిగిరావ‌డంతో.....

ABN, First Publish Date - 2020-08-08T17:23:42+05:30

యూపీలోని కాన్పూర్‌ ప‌రిధిలోగ‌ల‌ కల్నల్‌గంజ్‌లో ఒక మృతదేహాన్ని గుర్తించడంలో పోలీసులు, కుటుంబ స‌భ్యులు పొర‌పాటు ప‌డ్డారు. వారు ఖ‌న‌నం చేశామ‌నుకున్న‌ వ్య‌క్తి స‌జీవంగా తిరి‌గిరావ‌డంతో కంగుతిన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూర్‌: యూపీలోని కాన్పూర్‌ ప‌రిధిలోగ‌ల‌ కల్నల్‌గంజ్‌లో ఒక మృతదేహాన్ని గుర్తించడంలో పోలీసులు, కుటుంబ స‌భ్యులు పొర‌పాటు ప‌డ్డారు. వారు ఖ‌న‌నం చేశామ‌నుకున్న‌ వ్య‌క్తి స‌జీవంగా తిరి‌గిరావ‌డంతో కంగుతిన్నారు. దీంతో పోలీసులు ఆ వ్య‌క్తిని విచారిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే చ‌మ‌న్‌గంజ్ నివాసి అహ్మద్ హసన్ (39) భార్య నగ్మా, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. ఇంట్లో జ‌రిగిన గొడ‌వ‌ల కార‌ణంగా అహ్మ‌ద్ హ‌స‌న్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ స‌భ్యులు చాకేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇంత‌లో యతింఖానా సమీపంలో పోలీసులకు ఒక మృతదేహం ల‌భ్య‌మ‌య్యింది. దానిని పోలీసులు అహ్మ‌ద్ కుటుంబ స‌భ్యుల‌కు చూపించారు. వారు దానిని అహ్మద్ మృత‌దేహంగా గుర్తించారు. పోస్టుమార్టం నిర్వ‌హించిన అనంతరం ఆ మృత‌దేహాన్ని స్మశానవాటికలో ఖననం చేశారు. అయితే ఇంత‌లో అహ్మద్ ఇంటికి తిరిగి వ‌చ్చాడు. అహ్మ‌ద్‌ను చూసిన కుటుంబ స‌భ్యులు ఆశ్చ‌ర్య పోయారు. త‌రువాత వారు అతన్ని చాకేరి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో పోలీసులు అహ్మ‌ద్‌ను విచారిస్తున్నారు. కాగా యతింఖానా సమీపంలో ల‌భించిన మృత‌దేహం ఎవ‌రిదో ఇంకా తెలియ‌రాలేదు. దీంతో పోలీసులు గ‌తంలో ఖననం చేసిన‌ మృతదేహాన్నివెలికితీసి,  డీఎన్ఏ ప‌రీక్ష‌ల కోసం న‌మూనాలు సేక‌రించారు. త‌ద్వారా భవిష్యత్తులో ఎవరైనా ఈ మృత‌దేహం గురించి క్లెయిమ్ చేస్తే, డీఎన్ఏతో స‌రిపోల్చి చూడ‌వ‌చ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2020-08-08T17:23:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising