ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాబ్ పోయిందని స్కూటీపై ఫుడ్ స్టాల్... ఇక ఉద్యోగం వద్దంటూ...

ABN, First Publish Date - 2020-10-22T15:59:53+05:30

కరోనా కాలంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయి, రోడ్డనపడ్డారు. అయితే కొందరు దీనినే అవకాశంగా మలచుకుని, కొత్త ఉపాధి మార్గాలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కాలంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయి, రోడ్డనపడ్డారు. అయితే కొందరు దీనినే అవకాశంగా మలచుకుని, కొత్త ఉపాధి మార్గాలను ఎంచుకుని, వాటిలో స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగానే హర్యానాలోని గుర్‌గావ్‌కు చెందిన బల్వీర్ సింగ్(47) ఒక హోటల్‌లో పనిచేసేవాడు. డ్రైవర్ అయిన బల్వీర్ సింగ్ హోటల్‌కు సంబంధించిన వాహనాలను నడిపేవాడు. 


లాక్‌డౌన్ కారణంగా హోటల్‌లో పనిచేస్తున్న 50 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగం కోల్పోయిన బల్వీర్ సింగ్‌కు ఏమి చేయాలో పాలుపోలేదు. ఇంటిని నడిపేందుకు ఉన్న కాస్త పీఎఫ్ మొత్తాన్ని వినియోగించాల్సివచ్చింది. ఆ సొమ్ము అయిపోయాక పరిస్థితి మొదటికి వచ్చింది. దీంతో తన స్కూటీపై టిఫిన్లు విక్రయించే పని ప్రారంభించాడు. టిఫిన్ పాత్రలు అమర్చేందుకు అనువుగా స్కూటీకి ప్రత్యేక రూపం తీసుకువచ్చాడు. ఇందుకోసం రూ. 20 వేల వరకూ ఖర్చుచేశాడు. తరువాత కూరగాయల మార్కెట్ దగ్గర టిఫిన్లు విక్రయించడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా వినియోగదారుల సంఖ్య 70 వరకూ పెరుగుతూ వచ్చింది. దీంతో వ్యాపారాన్ని కాస్త విన్తరించాడు. ఫలితంగా వ్యాపారం ఆశాజనకంగా పరిణమించింది. దీంతో తాను ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తానని, ఇక ఉద్యోగం చేయవలసిన పనిలేదని బల్వీందర్ చెబుతున్నాడు. 

Updated Date - 2020-10-22T15:59:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising