ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లైవ్ స్ట్రీమింగ్‌లో పెళ్లి... వెడ్డింగ్ కార్డుపై ఆహ్వానం లింకు.. విందు డోర్ డెలివరీ!

ABN, First Publish Date - 2020-11-25T15:58:56+05:30

కరోనా కాలంలో పెళ్లిళ్ల తీరుతెన్నులు మారిపోయాయి. కరోనా గైడ్‌లైన్స్ ప్రకారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కాలంలో పెళ్లిళ్ల తీరుతెన్నులు మారిపోయాయి. కరోనా గైడ్‌లైన్స్ ప్రకారం పెళ్లికి హాజరయ్యే బంధువుల సంఖ్య పరిమితమయ్యింది. పెళ్లికి వందమందికి మించి బంధువులు, స్నేహితులను పిలిచే పరిస్థితులు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో వివిధ పట్టణాలో విభిన్న రీతులలో వివాహాలు జరుగుతున్నాయి. బంధువులందరినీ ఒకే రోజు పిలవకుండా వివిధ రోజుల్లో వారిని ఆహ్వానిస్తూ పెళ్లి తంతు కానిస్తున్నారు. పెళ్లి కార్డులోనే వివిధ రోజుల్లో వివిధ పెళ్లి తంతు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. 



ఇక పెళ్ళి రోజు వచ్చేసరికి దానిని లైవ్ టెలీకాస్ట్ చేస్తున్నారు. వివాహానికి హాజరుకాలేనివారంతా లైవ్‌లో దానిని వీక్షించవచ్చు. వారు ఇంట్లో కూర్చొనే ఈ వేడుకను తిలకించవచ్చు. ఇందుకోసం పెళ్లి కార్డులోనే ఈ లైవ్ స్ట్రీమ్‌కు సంబంధించిన లింక్ ఇస్తున్నారు. అలాగే బంధువులందరితో కూడిన ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అలాగే పెళ్లి విందు పార్సిళ్లను బంధువులు, స్నేహితులు ఇళ్లకు డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ విధమైన పెళ్లి వేడుకలకు ప్రస్తుతం ఎంతో ఆదరణ దక్కుతున్నదని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు. 

Updated Date - 2020-11-25T15:58:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising