ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొరచేపను ఎత్తుకెళ్లిన గద్ద.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2020-07-03T21:19:10+05:30

సౌత్ కాలిఫోర్నియాలోని మైర్టైల్ బీచ్‌లో ఉన్న ఓ భవనంలో యాష్లీ వైట్ అనే మహిళ నివసిస్తోంది. 17వ అంతస్తులోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సౌత్ కాలిఫోర్నియాలోని మైర్టైల్ బీచ్‌లో ఉన్న ఓ భవనంలో యాష్లీ వైట్ అనే మహిళ నివసిస్తోంది. 17వ అంతస్తులోని ఆమె గది బాల్కనీలోనుంచి బీచ్ గాలిని ఆస్వాదిస్తూ పరవశిస్తోంది. ఈ లోగా ఆకాశంలో చక్కర్లు కొడుతున్న ఓ గద్ద ఆమెను ఆకర్షించింది. అది ఓ చేపను పట్టుకుని గాలిలో ఎగురుతోంది. అయితే పరిశీలనగా గమనించిన ఆమెకు మతిపోయినంత పనైంది. ఎందుకంటే ఆ గద్ద పట్టుకెళుతోంది ఏదో సాదాసీదా చేపను కాదు. ఓ సొరచేపను. దీంతో షాక్‌కు గురైన ఆమె వెంటనే తన ఫోన్‌లో ఆ దృశ్యాన్ని చిత్రీకరిచి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అంత వైరల్ కాలేదు.


కానీ అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు రెక్స్ చాప్‌మన్ కూడా ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అయిపోయింది. కొన్ని గంటల్లోనే 14.4 మిలియన్ల(1కోటి 44 లక్షల) మంది ఈ వీడియోను చూశారు. 25 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో షార్క్ చేపను పట్టుకున్న గద్ద గాలిలో చక్కర్లు కొట్టడం, దాని పట్టునుంచి విడిపించుకునేందుకు సోరచేప గింజుకోవడం.. అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - 2020-07-03T21:19:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising