ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రహ్మకమల దర్శనం.. ఉత్తరాఖండ్‌లో అరుదైన దృశ్యం

ABN, First Publish Date - 2020-10-10T20:20:20+05:30

బ్రహ్మకమల దర్శనం జరిగింది. అత్యంత అరుదుగా పుష్పించే ఈ బ్రహ్మకమలం కేవలం హిమాలయాల్లో మాత్రమే సహజసిద్ధంగా వికసిస్తుంది. సాధారణంగా జూలై నుంచి సెప్టెంబరు మధ్య కాలంలోనే ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా: బ్రహ్మకమల దర్శనం జరిగింది. అత్యంత అరుదుగా పుష్పించే ఈ బ్రహ్మకమలం కేవలం హిమాలయాల్లో మాత్రమే సహజసిద్ధంగా వికసిస్తుంది. సాధారణంగా జూలై నుంచి సెప్టెంబరు మధ్య కాలంలోనే ఇది పుష్పిస్తుంది. అది కూడా కేవలం ఒక్క రాత్రి మాత్రమే ఇది కనిపిస్తుంది. ఈ పువ్వు రాత్రిళ్లు మాత్రమే వికసించడం వల్ల దీనికి రేరాణి అని కూడా పేరుంది. సైన్స్‌ పరంగా ఈ పువ్వును నైట్‌ బ్లాసమింగ్‌ సిరియస్‌ అని పిలుస్తారు. ఇందులో అనేక ఔషధ గుణాలుండడం వల్ల ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. 


హిందూ ఇతిహాసాల ప్రకారం బ్రహ్మ లేత ఎరుపు రంగు పుష్పంలో కూర్చుని ఉంటాడు. ఆ పుష్పం కమలం అని అంటారు. అయితే కొందరి వాదన ఏంటంటే.. బ్రహ్మ కూర్చుని ఉండేది కమలంపై కాదు. అది బ్రహ్మకమలం. అందువల్లే ఈ పుష్పానికి బ్రహ్మకమలం అని పేరు వచ్చిందని వారు చెబుతుంటారు. దీనివల్ల దీనిని దేవతా పుష్పంగా భావిస్తుంటారు. అందువల్ల కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ ఆలయాలకు వెళ్లే భక్తులు స్వామివార్లకు భక్తిశ్రద్ధలతో ఈ పుష్పాన్ని సమర్పిస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.


హిమాలయాల్లోని కొండలపైనే కాకుండా స్థానిక ఇళ్లలో కూడా వికసిస్తుంటాయి. బ్రహ్మకమలం ఏ ఇంట్లో అయితే వికసిస్తుందో.. ఆ ఇంట్లో సర్వసౌఖ్యాలూ కలుగుతాయని, అందులో నివశించేవారు ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో తులతూగుతారని అక్కడి వారి నమ్మకం. మన భారత ప్రభుత్వం కూడా 1982లో ఈ బ్రహ్మకమలంపై అధికారిక పోస్టల్‌ స్టాంపును సైతం విడుదల చేసింది.


సైంటిస్టులు చెబుతున్న దాని ప్రకారం.. బ్రహ్మకమలం.. ఒకరకమైన బ్రహ్మజెముడు జాతికి చెందిన మొక్క. ఈ మొక్క పెరగడానికి ఎక్కువగా నీరు అవసరం లేదు. రెండు, మూడు రోజులకు ఒకసారి నీరు అందితే చాలు.. ఈ మొక్క హాయిగా జీవించగలుగుతుంది. అయితే ఈ పువ్వు చూడడానికి అందంగా ఉన్నా.. వాసన మాత్రం దుర్భరంగా ఉంటుంది. మీకు అల్లుఅర్జున్‌ నటించిన బద్రీనాథ్‌ సినిమా గుర్తుండే ఉంటుంది కదా.. అందులో అల్లుఅర్జున్‌.. తమన్నాను వెంటబెట్టుకుని వెళ్లి మరీ కోయించేది ఈ పువ్వునే.. గుర్తుకొచ్చిందా..?

Updated Date - 2020-10-10T20:20:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising