ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాకిట్లో కొత్త జంట.. కార్లలో ఆశీర్వాదం.. ఇదేం పెళ్లిరా బాబు..!

ABN, First Publish Date - 2020-11-17T23:02:29+05:30

పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. అని ఒకప్పుడు చెప్పుకునేవారు. వివాహానికి వచ్చేవారిని గుమ్మం వద్దనుంచే సాదరంగా ఆహ్వానించి, అతిథులకు గౌరవమర్యాదలన్నీ చేసేవారు పెళ్లివారు. వచ్చిన అతిథులు కూడా మనస్ఫూర్తిగా నూతన దంపతులను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. అని ఒకప్పుడు చెప్పుకునేవారు. వివాహానికి వచ్చేవారిని గుమ్మం వద్దనుంచే సాదరంగా ఆహ్వానించి, అతిథులకు గౌరవమర్యాదలన్నీ చేసేవారు పెళ్లివారు. వచ్చిన అతిథులు కూడా మనస్ఫూర్తిగా నూతన దంపతులను దీవించి వెళ్లేవారు. అయితే అదంతా ఒకప్పుడు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఆగండి.. కాలం మారిందంటే.. బ్లాక్ అండ్ వైట్ సినిమా వేసుకోకండి. కరోనా ముందన్నమాట. కరోనా రానంత వరకూ అంతా ప్రశాంతంగా సాగింది. కానీ ఎప్పుడైతే ఈ మహమ్మారి అడుగు పెట్టిందో అంతా తలకిందులైంది. మనిషిని మనిషి తాకాలంటేనే భయపడుతున్నాడు. ఇక పెళ్లిళ్లకు జనాలు రావడం, దీవించడం గురించి పూర్తిగా మర్చిపోవాల్సిందే. కానీ దుబాయ్‌కు చెందిన ఆ జంట మాత్రం ఎలాగైనా బంధుమిత్రుల ఆశీస్సులతోనే తమ వివాహం జరగాలని అనుకున్నారు. 


కరోనా నేపథ్యంలో దుబాయ్‌లో స్ట్రిక్ట్ రూల్స్ అమలవుతున్నాయి. ఇళ్లలో ఫంక్షన్లు జరుపుకొనేటప్పుడు కచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ఇలాంటి నిబంధనలు అక్కడ అమలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సపరివార సమేతంగా వివాహం చేసుకోవడమంటే మాటలు కాదు. అసలే దుబాయ్.. నిబంధనలు అతిక్రమిస్తే అంతే సంగతులు. ఏం చేయాలో ఆ జంటకు అర్థం కాలేదు. అయితే వేరే దేశంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ వార్త వారిని ఆకర్షించింది. వెంటనే వారి తరహాలోనే విహాహ వేడుక నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసేసుకున్నారు.


యూఏఈకి చెందిన మహమ్మద్ జజెమ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఏరోనాటికల్ ఇంజరీనిర్‌గా పనిచేస్తున్నాడు. అల్మస్ అహ్మద్‌ ఫైనల్ ఇయర్ మెడికల్ కోర్స్ చదువుతోంది. వీరిద్దరికీ పెద్దలు వివాహం కుదిర్చారు. వివాహం అయితే పూర్తయింది కానీ.. బంధువుల ఆశీర్వాదాలు మాత్రం అందుకోలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ వివాహ వేడుక విధానంలో తాము కూడా ఓ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నారు. వెంటనే రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఓ పూల ఆర్చ్ కింద వధూవరులిద్దరూ నిలబడ్డారు. బంధువులంతా వచ్చి ఆశీర్వదించి ఓ ఫోటో తీసుకుని వెళ్లిపోయారు. అయితే బంధువులు అక్కడివరకు కార్లో వచ్చినా.. కారు మాత్రం దిగలేదు. కారులో నుంచే విష్ చేసి.. కొత్త దంపతులను ఓ ఫోటో తీసుకుని వెళ్లిపోయారు. 

Updated Date - 2020-11-17T23:02:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising