ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాలంటైన్స్ డే.. లవర్స్‌ను భయపెడుతున్న కొవిడ్-19

ABN, First Publish Date - 2020-02-13T16:23:57+05:30

కరోనా వైరస్ చైనాతోపాటు ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో శుక్రవారం నాడు జరుపుకోనున్న వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేయసీప్రియులు, దంపతులు ముద్దూ ముచ్చట్లకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కొవిడ్ 19.. చైనాతోపాటు ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో శుక్రవారం నాడు జరుపుకుంటున్న వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేయసీప్రియులు, దంపతులు ముద్దూ ముచ్చట్లకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ 19 ప్రబలుతున్న దృష్ట్యా ప్రేయసీప్రియులు, దంపతులు బయట ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం ప్రమాదకరమని వైద్యనిపుణులు హెచ్చరించారు. కొవిడ్ 19 సోకకుండా దంపతులు, ప్రేయసీప్రియులు ముద్దూ ముచ్చట్లకు దూరంగా ఇంట్లోనే సంతోషంగా గడపాలని నిపుణులు సలహా ఇచ్చారు.


వాలంటైన్స్ డే సందర్భంగా రెస్టారెంట్లకు జంటగా డిన్నర్లకు వెళ్లడం సర్వసాధారణమే అయినా వైరస్ ప్రబలుతున్నందున ఇంట్లోనే ఇద్దరూ కలిసి స్పెషల్ వంటకాలు చేసుకొని ఒకరికొకరు ప్రేమతో భోజనం చేయాలని నిపుణులు సూచించారు. ప్రేమికుల దినోత్సవం రోజు సినిమా థియేటరుకు వెళ్లి కలిసి సినిమా చూస్తుంటారని కాని, ఇంట్లోని హోం థియేటరులోనే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లలో సినిమా చూడవచ్చని సూచిస్తున్నారు.


శుక్రవారం ప్రేమికుల దినోత్సవం రోజు జంటగా వీడియో గేమ్స్ ఆడుకోవచ్చని సలహా ఇచ్చారు. ఇంట్లో సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి, పూలు, విద్యుత్ దీపాల కాంతులతో అలంకరించి రొమాంటిక్ టచ్ తో ప్రేమికుల దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోవాలని నిపుణులు సెలవిచ్చారు....ప్రేమికులూ, ప్రేమజంటలు ఇంకెందుకు ఆలస్యం... కరోనా వైరస్ సోకకుండా నిపుణుల సలహాలు పాటించి ప్రేమికుల దినోత్సవాన్ని వినూత్నంగా, ఆనందంగా ఇంట్లోనే జరుపుకుందాం రండి...

Updated Date - 2020-02-13T16:23:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising