ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నిరోధానికి ముక్కు ద్వారా మందు!

ABN, First Publish Date - 2020-09-25T01:30:21+05:30

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. టెస్ట్ రిపోర్టు వచ్చేలోపే లోకం చుట్టేస్తోంది. కరోనా లక్షణాలు ఏ మాత్రం లేకున్నా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. టెస్ట్ రిపోర్టు వచ్చేలోపే లోకం చుట్టేస్తోంది. కరోనా లక్షణాలు ఏ మాత్రం లేకున్నా వైరస్ బారిన పడుతున్నారు. కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాక కొన్నిసార్లు రోజులు తరబడి వేచి చూసే పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు క్వారంటైన్‌లో ఉండకుండా స్వేచ్చగా విహరిస్తున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది.


తాజాగా పదుల సెకన్లలోపే ఫలితాన్ని ఇవ్వగల అత్యంత వేగవంతమైన కరోనా పరీక్ష పద్ధతిని తీసుకొచ్చారు. ఎవరెన్ని తెచ్చినా కరోనా నిరోధం దిశగా ఎవరూ ఏదీ కనిపెట్టని స్థితిలో కోవిడ్ 19కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ వాషింగ్టన్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా జపాన్  ఐరోపా మినహా మిగతా దేశాల్లో నాజిల్ స్ప్రే సరఫరాకు అనుమతి తీసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. కోవిడ్-19కు ముక్కు ద్వారా వ్యాక్సిన్‌పై వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.



ఇక భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తొలి దశ ట్రయల్స్ సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో కొనసాగుతున్నాయి. ప్రయోగాలలో అవసరమైన రెగ్యులేటరీ అనుమతి పొందిన తర్వాత దేశంలో మరిన్ని దశల్ని కొనసాగించి పెద్ద ఎత్తున టీకా ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. 

Updated Date - 2020-09-25T01:30:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising