ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీడియో తీస్తుంటే.. ఎదురొచ్చిన పులి!

ABN, First Publish Date - 2020-11-14T18:12:26+05:30

ప్రకృతిలో ప్రతిజీవీ బిడ్డలకు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. తన పిల్లలతో ఉన్నప్పుడు వేరే జంతువులు దగ్గరగా వస్తే చాలు ఆగ్రహంతో ఊగిపోతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతిలో ప్రతిజీవీ బిడ్డలకు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. తన పిల్లలతో ఉన్నప్పుడు వేరే జంతువులు దగ్గరగా వస్తే చాలు ఆగ్రహంతో ఊగిపోతాయి. దాడిచేయడానికి ముందుకు దూకుతాయి. అలాంటిది ఓ పులి మాత్రం అలా చేయలేదు. తన బిడ్డలతో తిరుగుతుండగా దగ్గరగా వచ్చిన ఓ కారును చూసి కూడా బెదరలేదు. దానిలో నుంచి ఈ పులి కుటుంబాన్ని వీడియో తీస్తుంటే చక్కగా అక్కడే నిలబడి వీడియో తీయించుకుంది. ఆ తర్వాత కారుకు ఎదురుగా వచ్చి నిలబడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని దుధ్వా టైగర్ రిజర్వులో వెలుగుచూసింది


దుధ్వా టైగర్ రిజర్వులో ఫీల్డ్ డైరెక్టర్‌గా ఓ వ్యక్తి పనిచేస్తున్నాడు. చీకటి పడిన తర్వాత రిజర్వు ఫారెస్టులో తనిఖీ చేస్తున్నాడు. ఆ సమయంలో ఓ పులి తన పిల్లలతో కలిసి ఉండటం గమనించాడు. వెంటనే వాహనాన్ని ఆపి ఆ పులికుటుంబాన్ని వీడియో తీయడం ప్రారంభించాడు. వాహనం హెడ్‌లైట్లు తనపై పడటంతో ఆ పులి కారువైపు చూసింది. పిల్లలతో ఉన్నప్పుడు ఇలాంటి జీవులు కోపంగా ప్రవర్తిస్తాయి. ఎవరైనా దగ్గరకొస్తుంటే వెంటనే దాడి చేస్తాయి. దీంతో ఆ పులి కూడా తన వాహనంపై దాడి చేస్తుందనే సదరు ఫీల్డ్ డైరెక్టర్ భావించాడు.



ఆ పులి మాత్రం ఫీల్డ్ డైరెక్టర్ ఊహలకు విరుద్ధంగా ప్రవర్తించింది. కాసేపు అక్కడే తచ్చట్లాడి కారువైపు వచ్చింది. దాంతోపాటే దాని పిల్లలు కూడా వచ్చాయి. కారుకు చాలా దగ్గర్లోకి వచ్చిన తర్వాత ఆ పులి కాసేపు అక్కడే ఆగింది. ఆ తర్వాత పక్కకు తిరిగి వెళ్లిపోయింది. ఆ సమయంలో పులిపిల్లలు కూడా బొమ్మల్లా కాసేపు ఆ వాహనం ముందు నిలబడి, ఆ తర్వాత తల్లిని అనుసరించాయి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సీనియర్ ఆఫీసర్ రమేష్ పాండే ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘‘ఈ పులి, దాని పిల్లలను దుంధ్వా టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ అద్భుతంగా కెమెరాలో బంధించారు. దీన్ని కచ్చితంగా చూడాల్సిందే’’ అంటూ పోస్టు పెట్టారు.



ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఫీల్డ్ డైరెక్టర్‌ అదృష్టాన్ని మెచ్చుకుంటున్నారు. అలాగే కారు, కారులో మనుషులు ఉన్నా కూడా ఆ పులి కొంచెం కూడా బెదరలేదని, చాలా కంఫర్ట్‌గా కనిపించిందని అంటున్నారు. పులిపిల్లలు కూడా ఎటువంటి భయాందోళనలు చూపించకపోవడం నిజంగా టైగర్ రిజర్వు ఉద్యోగుల ఘనతేనని కొనియాడారు. తమకేమీ కాదనే భరోసాతోనే ఆ పులి కుటుంబం ఇలా ప్రవర్తించిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి అనుభవం జీవితంలో ఒక్కసారైనా వస్తే చాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.


Updated Date - 2020-11-14T18:12:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising