ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జన్మదినం రోజే మూడేళ్ల బాలుడు తుపాకీతో కాల్చుకొని...

ABN, First Publish Date - 2020-10-27T14:27:53+05:30

అమెరికాలో తుపాకుల సంస్కృతి మూడేళ్ల బాలుడిని బలిగొన్న విషాద ఘటన తాజాగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హూస్టన్ (అమెరికా): అమెరికాలో తుపాకుల సంస్కృతి మూడేళ్ల బాలుడిని బలిగొన్న విషాద ఘటన తాజాగా వెలుగుచూసింది. మూడేళ్ల బాలుడు తన జన్మదినోత్సవం రోజే తుపాకీతో కాల్చుకొని మరణించిన విషాద ఘటన అమెరికా దేశంలోని హూస్టన్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని పోర్టర్ పట్టణంలో జరిగింది. పోర్టర్ పట్టణంలో టెక్సాస్ నగరానికి చెందిన మూడేళ్ల బాలుడి పుట్టినరోజు  వేడుకలు ఓ ఇంట్లో జరుగుతున్నాయి. పిల్లలు  ఆడుకుంటుండగా, పెద్దలు పేకాట ఆడుతున్నారు. అంతలో తుపాకీ పేలిన శబ్ధం విన్న పెద్దలు బాలుడి వద్దకు వెళ్లి చూడగా ఛాతీలో నుంచి బుల్లెట్ దూసుకుపోయి రక్తసిక్తంతో పడి ఉన్నాడు. 


వెంటనే బాలుడ్ని సమీపంలోని అగ్నిమాపక కేంద్రానికి తరలించగా అప్పటికే మరణించాడని మోంట్గో మేరి కౌంటీ షెరీఫ్ అధికారులు చెప్పారు. బంధువుల జేబులో నుంచి పడిపోయిన పిస్టల్ ను బాలుడు తీసుకొని కాల్చుకున్నట్లు అధికారులు చెప్పారు.అమెరికాలో ఇలా పిస్టళ్లతో కాల్చుకోవడం వల్ల 97 మంది పిల్లలు  మరణించారని గ్రూప్ ఎవ్రీటౌన్ ఫర్ గన్ సేఫ్టీ అధికారి చెప్పారు. అమెరికాలో మూడవ వంతు మందికి తుపాకులున్నాయి. అందులోనూ టెక్సాస్ ఎక్కువ తుపాకులున్న రాష్ట్రాల్లో ఒకటి. బాలుడి జన్మదినోత్సవం రోజే బుల్లెటుకు బలికావడంతో ఆ ఇంట్లో విషాదం అలముకుంది. 

Updated Date - 2020-10-27T14:27:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising