ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్: రిమోట్ కంట్రోల్ మాస్కులూ వచ్చేశాయి! వీటి విశిష్టత తెలిస్తే...

ABN, First Publish Date - 2020-05-19T22:58:41+05:30

ఇజ్రాయిల్ కంపెనీ వారు రిమోట్ కంట్రోల్ మాస్కులను తయారు చేశారు. ఆటోమేటిక్‌గా తెరుకుచుకునే ఓ చిన్న రంధ్రాన్ని ఈ మాస్కులకు అమర్చారు. ఇది రిమోట్ కంట్రోల్ ఉపయోగించడం ద్వారా కానీ లేదా మామూలుగా చేతితోనైనా తెరిచే విధంగా రూపొందిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెల్ అవీవ్: మాస్క్ ధరించిన వారు ఏదైనా తినాలంటే ఇప్పటి వరకూ మాస్కును తొలగించాల్సి వచ్చేది. అయితే కరోనా సమయంలో ఇటువంటి సందర్భాలు కూడా ఒక్కోసారి పెను ప్రమాదానికి ఆహ్వానం పలుకుతాయి. అజాగ్రత్త, అలసత్వాలకు ఏ మాత్రం స్థానంలేని సమయమిది. అందుకే ఓ ఇజ్రాయిల్ కంపెనీ వారు రిమోట్ కంట్రోల్ మాస్కులను తయారు చేశారు. ఆటోమేటిక్‌గా తెరుకుచుకునే ఓ చిన్న రంధ్రాన్ని ఈ మాస్కులకు అమర్చారు. ఇది రిమోట్ కంట్రోల్ ఉపయోగించడం ద్వారా కానీ లేదా మామూలుగా చేతితోనైనా తెరిచే విధంగా రూపొందిచారు.


‘దీనికి ఉన్న సెస్సర్ల కారణంగా ఫోర్క్, స్పూన్లు వంటివి నోటికి సమీపంగా రాగానే రంధ్రానికి ఉన్న ద్వారం తనంతట తానుగా తెరుచుకుంటుంది’ అని దీన్ని తయారు చేసిన అవ్‌టీపస్ పేటెంట్స్ అండ్ ఇన్వెన్షన్స్ సంస్త ఉపాధ్యక్షుడు తెలిపారు. దీని ధర కేవలం .85  నుంచి 2.75 డాలర్ల మధ్య ఉంటుదన్నారు. అయితే ఈ ఆటోమేటిక్ మాస్కులపై ఆ దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరికేమో ఇదో అధ్భుత ఆవిష్కరణగా కినిపిస్తే మరి కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. పిజ్జా తినేందుకు అనువుగానే ఉన్నా ఐస్‌క్రీమ్ తినేటప్పుడు మాత్రం అంత అనువుగా లేదని, నోరంతా ఐస్‌క్రీమ్ కారుతోందని చెబుతున్నారు. 

Updated Date - 2020-05-19T22:58:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising