ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్రిజ్‌లో దొంగతనం.. దొంగను చూసి మురిసిపోతున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2020-09-26T22:13:48+05:30

ప్రతి రోజో ఫ్రిజ్‌లో పెట్టిన చీజ్(జున్ను) మాయమవుతోంది. ఇంట్లో దొంగలు ప్రవేశించిన దాఖలాలైతే లేవు. మరి ఛీజ్ ఎలా మాయమవుతోందో అర్థం కాక ఆ ఇంటి యజమాని జుట్టు పీక్కున్నాడు. ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తుండగా..ఓ కత్తి లాంటి ఐడియా మెదడులో మెరిసింది. నిజం వెలికి తీసేందుకు ఇంతకు మించి మరో మార్గం లేదని ఆయనకు అర్థమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి రోజూ ఫ్రిజ్‌లో పెట్టిన చీజ్(జున్ను) మాయమవుతోంది. ఇంట్లో దొంగలు ప్రవేశించిన దాఖలాలైతే లేవు. మరి ఛీజ్ ఎలా మాయమవుతోందో అర్థం కాక ఆ ఇంటి యజమాని జుట్టు పీక్కున్నాడు. ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తుండగా..ఓ కత్తి లాంటి ఐడియా మెదడులో మెరిసింది. నిజం వెలికి తీసేందుకు ఇంతకు మించి మరో మార్గం లేదని ఆయనకు అర్థమైంది. 


దీంతో ఓ సీక్రెట్ కెమెరాను సదరు యజమాని ఏర్పాటు చేశాడు. ఓ రోజు గడిచిన తరువాత..కెమెరా అసలు దొంగను ఇట్టే పట్టేసింది. ఈ వీడియోలో కనిపించిన దొంగను చూసిన ఇంటి యజమానికి కోపం రాకపోగా..ముఖంపై చిన్న నవ్వు విరబూసింది. కారణం..ఆ దోంగ అతడి పెంపుడు కుక్కే. ప్రతి రోజు ఆయన ఫ్రిజ్‌లో7 పెట్టిన వాటిని.. తలుపు తెరిచి సునాయసంగా నోట కరుచుకుని పోతోంది. 


అయితే పెంపుడు కుక్క అంటే వల్లమాలిన ప్రేమ కలిగిన అతడికి జరిగినదంతా చూస్తే తెగ ముచ్చటేసింది. దీంతో  ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెటిజన్లు కూడా కుక్కను చూసీ భలే క్యూట్‌గా ఉందంటూ తెగ పొగిడేస్తున్నారు. వీటితో వ్యవహారం ఇలాగే ఉంటుందంటూ తమకు జరిగిన సంఘటల్ని గుర్తు చేసుకుని మురిసిపోతున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 4.4 లక్షల వ్యూస్, 41 వేల లైకులు వచ్చాయి. ఇంతకీ ఈ క్యూట్ దొంగ పేరేంటో చెప్పనేలేదు.. కదూ! ఆ కుక్క పేరు ఆన్యా. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన జాగిలం ఇది.



Updated Date - 2020-09-26T22:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising