ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

300 ఏళ్ల కొబ్బరి సీమ వెనుక అసలు కథ!

ABN, First Publish Date - 2020-09-04T00:09:05+05:30

కోనసీమకు కొబ్బరితోటలకు మూడు శతాబ్దాలకు పూర్వమే అనుబంధం ఏర్పడిందని చెబుతారు. కోనసీమ భౌగోళికంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: కోనసీమకు కొబ్బరితోటలకు మూడు శతాబ్దాలకు పూర్వమే అనుబంధం ఏర్పడిందని చెబుతారు. కోనసీమ భౌగోళికంగా ఓ ద్వీపంలా ఉంటుంది. మూడు వైపులా గోదావరి పాయలు ప్రవహిస్తుంటాయి. విశిష్ట, వైనతేయ, గౌతమి పాయల ప్రవాహం కోనసీమను సస్యశ్యామలం చేసింది. మరో దిక్కున బంగాళాఖాతం ఉంది. బంగాళాఖాతం తీర ప్రాంతంకావడంతోనే కొబ్బరి సాగు మొదలైందని కొందరి అభిప్రాయం. ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి తూర్పు ఆసియా దేశాల నుంచి తుఫానులు, ఇతర సందర్భాల్లో  కొబ్బరికాయలు కొట్టుకువచ్చి ఉంటాయని తమ పూర్వీకులు అంటుండుండేవారని అక్కడి పెద్దల మాట. 


ఈ వాదనకు శాస్త్రీయ ఆధారాలు లేకపోయినప్పటికీ చాలా మంది దీంతో ఏకీభవిస్తున్నారు. సముద్రం ద్వారా కొట్టుకు వచ్చిన కొన్ని కొబ్బరి కాయలు కోనసీమ ప్రాంతంలో మొలచాయని, వాటి కాయలు తమకు ఉపయోగపడటంతో రాను రాను స్థానికులు కొబ్బరి సాగు చేశారనే అంచనాలు ఉన్నాయి. కోనసీమ చాలా తరాలుగా కొబ్బరి సాగులో తలమునకలై ఉంది. స్థానికుల జీవితాల్లో ఇదే భాగమై పోయింది. కొబ్బరాకుతో ఇళ్లు వేసుకుని ఉంటారు. కొబ్బరి పీచును వివిధ రకాలుగా వాడుతారు. కొబ్బరి కాయల విక్రయంతో బతుకు సాగిస్తూ ఉంటారు. 

Updated Date - 2020-09-04T00:09:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising