ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వేళ 73 శాతం మంది...

ABN, First Publish Date - 2020-09-04T23:45:39+05:30

లాక్‌డౌన్ సమయంలో ఇంటి పట్టున ఉంటున్న భార్యాభర్తలు చాలా మందికి సమయం దొరకడంతో దాంపత్య జీవితం మీదనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్ సమయంలో ఇంటి పట్టున ఉంటున్న భార్యాభర్తలు చాలా మందికి సమయం దొరకడంతో దాంపత్య జీవితం మీదనే పూర్తి ఫోకస్ పెట్టి ఎంజాయ్ చేశారనే వార్తలు చూశాం. కానీ అదే జంటలు పునరుత్పత్తి అంటే తెగ భయపడిపోతున్నాయట. ప్రఖ్యాతిగాంచిన జోనల్ ఆఫ్ సైకో స్మాటిక్ రీసెర్చ్ గైనకాలజీ ఇటీవల ఇదే విషయం మీద ఒక స్టడీ నిర్వహించింది. మనదేశంతో సహా చాలా దేశాల్లో జంటలు కరోనా సమయంలో తల్లిదండ్రులు కాకూడదనుకుంటున్నారు. గర్భం దాల్చినప్పుడు కరోనా సోకితే కష్టమనే భయం ఇందుకు ప్రధాన కారణం. సర్వేలో పాల్గొన్న 73 శాతం మంది అభిప్రాయం వెల్లబుచ్చారట. 


ఇందుకు మన దేశంలోని నగరాలు కూడా మినహాయింపు కాదట.  గర్భం వస్తే ప్రతి నెలా చెకప్‌కు ఆస్పత్రికి వెళ్లాల్సిరావడం, డాక్టర్లు, ఆస్పత్రులు అందుబాటులో లేకపోవడం, డాక్టర్లు కూడా ఎక్కువ మంది పేషెంట్లను డైరెక్ట్‌గా చూడకుండా ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ చేస్తామనడం ఇందుకు కారణం. చాలా మంది జంటల్లో ఇంకో భయం కూడా ఉంది. కరోనా కారణంలో ఆర్థిక వ్యవస్థలు కుదేలుకావడం, ఉద్యోగాలకు గ్యారంటీ లేకపోవడం కూడా కారణమట. 


సర్వేలో పాల్గొన్న గైనకాలజిస్ట్‌లు కూడా తాము దంపతులకు ప్రస్తుతానికి ప్రెగెన్సీ పోస్ట్ పోన్డ్ చేసుకోమని చెబుతున్నామని చాలా మంది అందుకు ఒప్పుకుంటున్నారని అంటున్నారట. ఇదంతా ఉద్యోగాల మీద ఆధార పడ్డ జంటల సంగతైతే.. మన హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో ఇంకో నయా ట్రెండ్ నడుస్తోంది. డబ్బుల కోసం అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్ చేసే ఆస్పత్రులు, డాక్టర్లు మాత్రం సిజేరియన్లు చేయమని చెప్పేస్తున్నారట. ఇందుకు డాక్టర్లలో కరోనా భయమేకారణం. సిటీలో ఒక ప్రముఖ గైనకాలజిస్ట్  ఏం చెప్పారంటే ఇప్పుడు తెలంగాణలో కానీ ఏపీలో కాని ఎవరికైనా ఏ సర్జరీ గాని, ఏ మెడికల్ ప్రొసీజర్ చేసే ముందు కరోనా టెస్ట్ చేయాలన్న రూల్ పెట్టలేదు. 


Updated Date - 2020-09-04T23:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising