ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాఖీ పండుగను వినూత్నంగా జరుపుకున్న విద్యార్థినులు

ABN, First Publish Date - 2020-08-03T21:08:17+05:30

ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో విద్యార్ధినులు రక్షాబందన్ వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొరదాబాద్: ఉత్తర ప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో విద్యార్ధినులు రక్షాబంధన్ వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ప్రయత్నించారు. ‘‘పర్యావరణాన్ని పరిరక్షించండి’’, ‘‘చెట్లను రక్షించండి. జీవితాలను కాపాడండి..’’ అంటూ రాఖీలపై సందేశాలు రాశారు. ఈ సందర్భంగా ఓ విద్యార్ధిని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాం. అందరం చెట్లకు రాఖీలు కడుతున్నాం. చెట్ల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చెబుతున్నాం...’’ అని పేర్కొంది. ‘‘జనాభా పెరుగుతున్న కొద్దీ చెట్లను అంతకంతకూ నరికేస్తున్నారు. చెట్లను రక్షించి పర్యావరణాన్ని పెంపొందించడం మన బాధ్యత..’’ అని మరో విద్యార్ధిని పేర్కొంది. రక్షణకు సూచనగా రాఖీలు కడతామనీ.. అదే విధంగా చెట్లు మనల్ని కాపాడుతున్నందున వాటికి కూడా రాఖీలు కడుతున్నామని ఆమె పేర్కొంది. 

Updated Date - 2020-08-03T21:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising