ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7 రోజులుగా జరుగుతోంది ఇదా! మహిళ చెవిలోకి చూసి డాక్టరు షాక్!

ABN, First Publish Date - 2020-04-29T03:47:08+05:30

మహిళ చెవిని పరీక్షిస్తూ డాక్టరు తీసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: మహిళ చెవిని పరీక్షిస్తూ డాక్టరు తీసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సించువా ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల చెవినొప్పితో డాక్టరు దగ్గరికి వెళ్లింది. వారం రోజులుగా చెవిలో పోటు వస్తోందని, ఏదో కుడుతున్నట్టు ఉందని డాక్టరుకు చెప్పింది. మహిళను పరీక్షించన డాక్టరుకు మరింత స్పష్టత కోసం ఆమెకు ఓటోస్కోపీ చేశారు. ఆ సందర్భంలో కినిపించిన దృశ్యాలు డాక్టర్లనే ఆశ్చర్యంలో ముంచెత్తాయి. చెవిలో తెల్లని దారపు ఉండ వెనకాల ఓ సాలీడు దాక్కుని అప్పుడూ బయటకు వస్తూ వారికి కనిపించింది. దీంతో వారం రోజులుగా ఆ సాలీడు చెవిలో మకాం వేసి గూడు కట్టుకుంటోందని డాక్టరు అర్థమైంది. విషయం పూర్తిగా అర్థమవడంతో డాక్టరు.. మహిళ చెవిల కొన్ని మందు చుక్కలు వేసి సాలీడు అచేతనం అయ్యేలా చేశాడు. ఆ తరువాత దాన్ని బయటకు తొలిగించాడు. అయితే చికిత్స సందర్భంగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




Updated Date - 2020-04-29T03:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising