ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగుల కోసం ప్రత్యేక మాస్కులు

ABN, First Publish Date - 2020-05-19T22:19:37+05:30

దివ్యాంగుల కోసం కోసం 81వేల మాస్కులను అందించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: దివ్యాంగుల కోసం కోసం 81వేల మాస్కులను అందించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటిచింది. ఈ మాస్కులన్నీ పారదర్శకంగా ఉంటాయని.. మాట్లాడడం, వినడంలో సమస్యలున్న వారికి ఇవి ఉపయోగపడతాయని తెలిపింది. సాధారణంగా వినికిడి, మాట్లాడడంలో లోపాలున్న వారు ఎదుటివారి పెదవుల కదలికల ఆధారంగా సంభాషిస్తారని, అయితే సాధారణ మాస్కుల ద్వారా ఇది సాధ్యం కాదని, అందుకోసమే ఈ మాస్కులను అందించనున్నట్లు తెలిపారు. ఈ మాస్కులను దివ్యాంగులతో పాటు వారి తల్లిదండ్రులకు, శిక్షకులు, ఉపాధ్యాయులు, సన్నిహితులకు అందించడం జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. దీనివల్ల వారితో సంభాషించడం దివ్యాంగులకు సులభమవుతుందని పేర్కొంది.


ఈ మాస్కులను పంపిణీ చేసే ప్రాజెక్టును తమిళనాడు దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనరేట్ చేపట్టనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా స్థానిక సంక్షేమ శాఖల ద్వారా ఈ మాస్కులను ఆయా జిల్లాల్లోని దివ్యాంగులకు అందజేయడం జరుగుతుందని వివరించింది. ఈ మాస్కులను వారికి అందించిన తరువాత వారి అభిప్రాయాలను సేకరించి ఏవైనా మార్పులు అవసరమైతే చేయడం జరుగుతుందని తెలిపింది.

Updated Date - 2020-05-19T22:19:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising