ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్: త్వరలో ఇళ్లలోంచి ఇడ్లీలు మాయం?

ABN, First Publish Date - 2020-04-09T02:21:25+05:30

ఇడ్లీ.. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అనేక మంది ఉదయాన ఇడ్లీనే అల్పాహారంగా తీసుకుంటారు. కానీ కరోనా పూణ్యమా అని ఇడ్లీకి కూడా కరువచ్చే రోజులు దాపురించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఇడ్లీ.. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అనేక మంది ఉదయాన ఇడ్లీనే అల్పాహారంగా తీసుకుంటారు. కానీ కరోనా పూణ్యమా అని ఇడ్లీకి కూడా కరువచ్చే రోజులు దాపురించాయి. వీటి తయారీకి వాడే మినపప్పుకు కటకట ఏర్పడటమే ఇందుకు కారణమని తమిళనాడుకు చెందిన వ్యాపారులు అంటున్నారు. రాష్ట్రానికి దిగుమతయ్యే కంది పప్పు, మినపప్పుల్లో ప్రస్తుతం కేవలం 25 శాతం మాత్రమే దిగుమతువుతోందంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచే వీటిల్ని ఎక్కువగా తెప్పించుకుంటామని, కానీ ఆయా రాష్ట్రాల సరిహద్దులు మూసేయండో సరుకు రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. దీనికి తోడు.. వీటి స్టాక్ ఎలాగైనా పెంచుకోవాలనుకునే వ్యాపారుల వల్ల ధరలు మరింతంగా పెరిగిపోతున్నాయని అంటున్నారు.ఇక కార్మికులు, డ్రైవర్లు లేకపోవడం వంటి ఇతర సమస్యలు కూడా ధరల పెరిగడానికి కారణమని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక ఇళ్లోంచి ఇడ్లీలు మాయమవుతాయా అంటూ అక్కడి ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-04-09T02:21:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising