ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాము కాటు వేయగానే ఏం చేయాలో తెలుసా?

ABN, First Publish Date - 2020-07-05T01:51:08+05:30

పాము కాటు వేసినప్పుడు అది విషపూరితమైనది కాకపోతే పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే విషపూరితమైన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాము కాటు వేసినప్పుడు అది విషపూరితమైనది కాకపోతే పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే విషపూరితమైన పాము అయితే క్షణం క్షణం మృత్యువు తరుముకొస్తూ ఉంటుంది. ప్రాణాలు దక్కించుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలి. అలా చేయాలంటే విషపూరితమైన పాము కాటు వేస్తే వెంటనే మనలో ఎలాంటి మార్పులొస్తాయో  తెలియాలి. కాటు వేసిన ప్రదేశాన్ని జాగ్రత్తగా గమనించాలి. అక్కడ మనకు ఇంజెక్షన్ చేసినప్పుడు ఎలాగైతే చర్మానికి చిన్న కన్నం పడుతుందో అలాంటి రెండు కన్నాలు పక్క పక్కనే పడి ఉంటాయి. ఆ రెండు కన్నాలు ఉన్నాయంటే ఆ పాముకు కోరలు ఉన్నట్లే. అది విషపూరితమైన పామే అని తెలుసుకోవాలి. పాము కాటు వేసిన చోట నెప్పిగా ఉంటుంది. ఆ ప్రదేశంలో కొద్దిగా వాపు వస్తుంది. అలాగే పాలిపోయినట్లుగా కలర్ లేకుండా తయారవుతుంది. అంతేకాదు ఊపిరి సరిగా ఆడదు. వికారంగా ఉంటుంది. హైబీపీ వస్తుంది. నరాల వీక్నెస్ ఉంటుంది. జ్వరంగా కూడా ఉంటుంది. కొన్ని పాములు కాటు వేసినప్పుడు అంబులెన్స్ వచ్చే లోపే ప్రాణం పోతుంది. కొన్నిసార్లు బతికే ఛాన్స్ ఉంటుంది. మరి అంబులెన్స్ వచ్చే లోపు ఏం చేయాలంటే... కాటు వేసిన చర్మ ప్రదేశాన్ని గమనించాలి. విషం బయటకు వచ్చేలా ఉంటే జాగ్రత్తగా బయటకు తీయాలి. అంటే లోపలి చర్మం దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. నీరు, టీ వంటివి బాగా తాగాలి. వాటికి బాడిలోని విషవ్యర్ధాలను తొలగించే శక్తి ఉంటుంది. అటూ ఇటూ కదలకుండా ఉండాలి. అందువల్ల విషం మరింత విస్తరించకుండా ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం పెరిగితే విషం విస్తరించే వేగం కూడా పెరుగుతుంది. యాంథిస్టమైన్స్ అనే ట్యాబ్లెట్ వేసుకోవాలి. లేదా కార్డియాక్ మందులు కూడా వేసుకోవచ్చు. 

Updated Date - 2020-07-05T01:51:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising