ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్ జైలు నుంచి విముక్తి... 8 ఏళ్ల తరువాత షంషుద్దీన్‌ ఇంట్లో వేడుకలు!

ABN, First Publish Date - 2020-11-16T15:53:19+05:30

పాక్‌లో గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో 8 ఏళ్లుగా అక్కడి జైలులో బంధీగా ఉన్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూర్(యూపీ): పాక్‌లో గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో 8 ఏళ్లుగా అక్కడి జైలులో బంధీగా ఉన్న షంషుద్దీన్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం యూపీలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటిలోని అందరినీ చూశాక అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంటిలోని అతని కుమార్తెలు తండ్రిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. షంషుద్దీన్ సోదరి తన అన్నను చూసి స్పృహ తప్పిపోయింది. ఇంటిలోని వారంతా దీపావళి వేడుకలను అత్యంత ఆనందంగా చేసుకున్నారు. నిజానికి షంషుద్దీన్ అక్టోబరు 26నే అమృతసర్ చేరుకున్నారు. 


అయితే అతను తన స్వస్థలం కాన్పూర్ చేరుకోవడంలో జాప్యం జరిగింది. శుక్రవారం స్థానిక పోలీసులు, నిఘా ఏజెన్సీ అతనిని తీసుకు వచ్చేందుకు అమృత్‌సర్ వెళ్లింది. వారు ఆదివారం రాత్రి షంషుద్దీన్‌ను బజరియా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడి పోలీసు అధికారులు అతనిని స్వాగతించి, మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా షంషుద్దీన్ మాట్లాడుతూ ఇదే తనకు నిజమైన దీపావళి అని, తనకు కుమార్తె కూడా దీపావళి రోజునే పుట్టిందని తెలిపారు. కాగా షంషుద్దీన్ సోదరుడు కహీముద్దీన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తన సోదరుణ్ణి తీసుకువెళ్లేందుకు చట్టబద్దమైన విధాన ప్రక్రియ పూర్తిచేశారు. షంషుద్దీన్ రాక సందర్భంగా అతని ఇంటి చుట్టుపక్కలవారంతా సందడి చేశారు. 


Updated Date - 2020-11-16T15:53:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising